Summer Food : బనానాతో టేస్టీ షీరా, పాయసం ఇలా తయారు చేసుకోవచ్చు.. మస్త్ టేస్ట్..!

అన్ని కాలాల్లో దొరుకుతూ... మన ఆరోగ్యానికి అండగా ఉండే పండు... 'అరటిపండు'. చాలారకాల ఆరోగ్య సమస్యలకు ఈ పండు ఫుల్స్టాప్ పెడుతుంది. తెలుసా! ఆరోగ్యానికి మంచిదని పిల్లలకూ అలాగే తినిపిస్తారు. అయితే పిల్లలు ఇష్టంగా ఏది తినాలన్నా, అది కొత్తగా ఉండాలి. అందుకే అరటిపండ్లతో కొత్తకొత్త వంటలు చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మరెందుకు ఆలస్యం, ట్రైచేయండి.

షీలా

కావాల్సినవి : ఉప్మారవ్వ - ఒక కప్పు అరటిపండు ముక్కలు -ఒకటిన్నర కప్పు బాదం, జీడిపప్పు తురుగు - ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ - అర టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి - అర టీ స్పూన్ నెయ్యి - మూడు టేబుల్ స్పూన్లు చక్కెర - ఆరు టేబుల్ స్పూన్లు కుంకుమ పువ్వు - చిటికెడు వేడి పాలు లేదా నీళ్లు-రెండున్నర కప్పులు

తయారీ: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక ఉప్మారవ్వ వేసి దోరగా వేగించాలి. అందులో అరటిపండు ముక్కలు వేసి కలపాలి. తర్వాత వేడి పాలు లేదా నీళ్లు, నెయ్యిలో వేగించిన బాదం, జీ డిపప్పు ముక్కలు, కిస్మిస్లు వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత చక్కెర వేయాలి. మిశ్రమం గట్టిపడేవరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. మంట తగ్గించి కుంకుమ పువ్వు వేసి కలపాలి. మరో రెండు నిమిషాల తర్వాత పాన్ని దింపేయాలి. ఉప్మా రవ్వకి బదులు గోధుమ రవ్వ కూడా వాడొచ్చు. తక్కువ సమయంలోనే రుచికరమైన బనానా షీరాను ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.

పాయసం 

కావాల్సినవి : అరటిపండ్లు-రెండు బెల్లం తరుగు - అర కప్పు పల్చటి పాలు-ముప్పావు కప్పు చిక్కటి పాలు - అర కప్పు ఇలాచీ పొడి - పావు టీ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు - ఒక టేబుల్ స్పూన్ నెయ్యి -ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు -ఒక టీ స్పూన్ కిస్మిస్ - ఒక టీ స్పూన్ బాదంపప్పు తరుగు - ఒక టీ స్పూన్ 

తయారీ : స్టవ్ పై గిన్నె పెట్టి... అందులో బెల్లం తరుగు వేయాలి. దాంట్లో సరిపడా నీళ్లు పోసి కరిగించాలి. తర్వాత మిశ్రమాన్ని వడగట్టి పక్కన పెట్టాలి. లేదంటే చక్కెర కూడా వేసుకోవచ్చు.అరటిపండ్ల తొక్క తీసి ముక్కలుగా తరగాలి. వాటిని మిక్సీలోవేసి గ్రైండ్ చేయాలి. స్టవ్ వెలిగించినెయ్యి వేడి చేశాక బాదం, జీడిపప్పు,ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్లనువేగించి పక్కన పెట్టాలి. 

ఆ నెయ్యిలోనేఅరటిపండు గుజ్జు వేయాలి. బెల్లంపాకం, చిక్కటి పాలు,పల్చటి పాలు పోసి బాగా కలపాలి. మిశ్రమంచిక్కగయ్యాక నెయ్యిలో వేగించినకొబ్బరి ముక్కలు, బాదం, జీడిపప్పు,కిస్మిస్లు, ఇలాచీ పొడి వేసి కలపాలి.రెండు నిమిషాల తర్వాత గిన్నెనుదింపేయాలి. టేస్టీ... టేస్టీ బనానాపాయసం రెడీ.