Donald Trump: ట్రంప్కు రక్షణగా ఎస్టేట్లో రోబోటిక్ డాగ్స్ పెట్రోలింగ్

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. ట్రంప్ గ్రాండ్ విక్టరీతో రెండోసారి వైట్ హౌజ్లో అడుగుపెట్టారు. ఎన్నికల క్యాంపెయిన్ లో తనపై రెండు సార్లు హత్యా ప్రయత్నం జరగడంతో వైట్హౌజ్తో పాటు ట్రంప్ ఎస్టేట్ లో కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే చీఫ్ సెక్యూరిటీ స్టాఫ్ ను నియమిచారు. అయితే ట్రంప్ సెక్యూరిటీలో ఓ ప్రత్యేకత ఉంది. అదే రోబోటిక్ డాగ్స్.. 

ఫ్లోరిడాలోని డొనాల్డ్ ట్రంప్కు చెందిన మార్ ఏ లాగో ఇంటిపై ప్యాట్రోలింగ్కు అమెరికా సీక్రెట్ సర్వీస్ రోబోటిక్ కుక్కలను ఉపయోగిస్తుంది.బోస్టన్ డైనమిక్స్ తయారు చేసిన రోబోలు ఫ్లోరిడాలోని ట్రంప్ ఇంట్లో సెక్యూరిటీ పహారా కాస్తున్నాయి.

ALSO READ : ఇజ్రాయెల్‎ ఆటలు ఇక సాగవు.. ఇరాన్ అమ్ములపొదిలో బ్రహ్మాండమైన అస్త్రం

 

డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు అమెరికా కుట్ర..?

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర చేస్తున్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా ఆరోపణలను ఇరాన్ విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. ప్రస్తుత అమెరికన్ అధికారులను లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నానికి పాల్పడిందనే ఆరోపణలను తిరస్కరించింది.