ఆ దేశాలు అమెరికాలో విలీనమైతే బెటర్​

  • కెనడా, మెక్సికోలపై ట్రంప్ సెటైర్​

వాషింగ్టన్​: పొరుగు దేశాలు అమెరికా నుంచి పొందుతున్న రాయితీలపై ఆ దేశ తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెనడా, మెక్సికో లకు భారీ సబ్సిడీలు ఇచ్చేకంటే ఆ రెండు దేశాలను అమెరికాలో విలీనం చేసుకుంటే సరిపోతుందని అన్నారు. మీడియా ఇంటర్వ్యూలో ట్రంప్​ మాట్లాడారు. 

కెనడాకు ఏటా దాదాపు రూ.8 లక్షల కోట్లకు పైగా, మెక్సికోకు రూ.24 లక్షల కోట్లకుపైగా రాయితీ ఇస్తున్నాం. ఆ దేశాలకు మనం ఎందుకు అంత భారీ సబ్సిడీ ఇవ్వాలి.  దానికి బదులు ఆ 2 దేశాలు అమెరికాలో విలీనం అయితే సరిపోతుంది కదా?” అని వ్యాఖ్యానించారు.