యూఎస్ ఆర్మీ నుంచి ట్రాన్స్​ జెండర్లు ఔట్!

 

  • అధ్యక్ష పదవి చేపట్టగానే తొలగించనున్న ట్రంప్

 
వాషింగ్టన్:  అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తమ దేశ మిలిటరీ నుంచి ట్రాన్స్ జెండర్లను తొలగించనున్నారు. మిలిటరీలో ట్రాన్స్ జెండర్ల సేవలపై నిషేధం విధించే ఉత్తర్వులపై అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన సంతకం చేయనున్నారు. ఆ ఆదేశాలు అమల్లోకి వస్తే 15 వేల మంది ట్రాన్స్ జెండర్  సర్వీస్  మెంబర్లు అన్ ఫిట్ అవుతారు. దీంతో సాయుధ బలగాల నుంచి వారు వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలాగే, మిలిటరీలో చేరడానికి వారు అనర్హులవుతారు. కాగా, భిన్నత్వం, సమానత్వం, సమ్మిళితానికే మిలిటరీలో అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారని, కానీ.. అంతకన్నా యుద్ధానికి సన్నద్ధం కావడమే ముఖ్యమని ట్రంప్ పేర్కొన్నారు.