నాసా చీఫ్గా ఎలాన్ మస్క్ ఫ్రెండ్, బిలియనీర్ జేర్డ్ ఐజాక్ మెన్

యూఎస్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) చీఫ్ గా వ్యోమగామి, బిలియనీర్ జేర్డ్ ఐజాక్ మెన్ ఎంపికయ్యారు. గురువారం( డిసెంబర్ 5) జేర్డ్ ఐజాక్ మెన్ ను నామినేట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 

41 ఏళ్ల ఐజాక్ మెన్..పెన్సిల్వేనియాకు చెందిన పేమెంట్ ప్రాసెసింగ్ కంపెనీ Shift4 వ్యవస్థాపకుడు. కమర్షియల్ స్పేస్ X మిషన్ లో భాగంగా ఐజాక్ మెన్  రెండుసార్లు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. అయితే ఇతను నాసాలో ఎప్పుడూ కూడా పనిచేయలేదు. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం.. 1.9 బిలియన్ డాలర్ల సంపదతో ఐజాక్ మెన్  ప్రపంచ బిలియనీర్ గా ఉన్నారు.