యూఎస్లో ​51వ స్టేట్గా కెనడా చేరాలి.. పిలుపునిచ్చిన డొనాల్డ్​ ట్రంప్

న్యూయార్క్: కెనడా ప్రధానిగా జస్టిన్  ట్రూడో రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ఏ 51వ రాష్ట్రంగా కెనడా ఉండాలని పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన ట్రూత్​ సోషల్​లో పోస్టు పెట్టాడు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 51వ రాష్ట్రంగా కలిసిపోవడం మెజారిటీ కెనెడియన్లకు అంగీకారమేనని చెప్పారు.

కెనడాకు అధికంగా రాయితీలిచ్చి అమెరికా ఇంకా నష్టపోవాల్సిన అవసరంలేదన్నారు. ఇది ఆ దేశ ప్రధాని ట్రూడోకు ముందే తెలుసునని, అందుకే ఆయన రాజీనామా చేశారని తెలిపారు. యూఎస్ఏలో కెనడా భాగమైతే సుంకాల బాధ ఉండదని, రాయితీలు పెరుగుతాయని చెప్పారు. రష్యా, చైనాలకు చెందిన షిప్​లనుంచి కెనడాకు ఇక ఎలాంటి ముప్పు ఉండదని అన్నారు. కెనడా ఇంకా ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతుందని ట్రంప్​ కామెంట్ చేశారు.