Canada study visa: భారతీయ విద్యార్థులకు కెనడా షాక్..స్టడీ వీసా పొందడం ఇకపై చాలా కష్టం

భారతీయ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం షాకిచ్చింది. కెనడాలో చదువుకునే వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే ఫాస్ట్ స్టడీ పర్మిట్ ను రద్దు చేసింది. స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ (SDS)  ప్రొగ్రామ్ ను నవంబర్ 8న కెనడియన్ ప్రభుత్వం రద్దు చేసింది. 

2018లో ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజెస్ సిటిజెన్ షిప్ (IRCC) ద్వారా ప్రవేశపెట్టిన ఈ SDS ప్రోగ్రామ్తో భారత్, చైనా, ఫిలిప్పీ్న్స్ వంటి 14 దేశాల విద్యార్థలకు వీసా జారీ చేస్తోంది కెనడా ప్రభుత్వం. 

ALSO READ : హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్.. పూర్తి వివరాలు ఇవే

కాస్ట్ ఆఫ్ లివింగ్,తరుగుతున్న వనరులపై ఆందోళనతో అంతర్జాతీయ విద్యార్థులను కట్టడి చేసేందుకు కెనడా ప్రభుత్వం SDS ప్రోగ్రామ్ను రద్దు చేస్తున్నట్లు తెలు స్తోంది.

SDS రద్దుతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ (PGWP) నిబంధనలు మరింత కఠిన తరం చేసింది.2023లో రికార్డు స్థాయిలో 8లక్షల స్టడీ పర్మిట్ హోల్డర్‌లకు ఆతిథ్యం ఇచ్చినప్పటికీ..హౌసింగ్, పబ్లిక్ సర్వీసెస్‌పై ఒత్తిడితో 2025లో 4లక్షల37వేలకు కుదించింది.