జాతీయస్థాయి ఎన్సీఎస్సీ పోటీలకు త్రివేణి విద్యార్థిని ఎంపిక 

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం నగరంలోని త్రివేణి పాఠశాలకు చెందిన విద్యార్థి డార్విన్ బాలాజీ  గైడ్ టీచర్ ఇవి సుబ్బారావు ఆధ్వర్యంలో హైదరాబాద్ బేగంపేట లో జరిగిన రాష్ట్రస్థాయి ఎన్సీఎస్సీ పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతిని పొందాడు. జనవరి 3 నుంచి 6 వరకు  భోపాల్ లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించాడు. బాలాజీ చేసిన ‘సొల్యూషన్స్ టు ద కన్వర్జేషన్ ఆఫ్ బయో డైవర్సిటీ ఫ్రమ్ ద గ్రానైట్ ఎగ్జాస్టర్స్’  పై చేసిన ప్రాజెక్టు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది.

ఈ సందర్భంగా మంగళవారం పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ తమ విద్యార్థులు ప్రతిభ ఆధారంగా ఉన్నత శిఖరాలను అధిరోహించడం స్కూల్​కు గర్వకారణమన్నారు. విద్యార్థి డార్విన్ బాలాజీని పలువురు అభినందించారు.  ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ కృష్ణవేణి, త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు, స్కూల్​ సీఆర్ఓ కాట్రగడ్డ మురళీకృష్ణ, పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ స్వప్న, ముస్తఫా క్యాంపస్ ఇన్​చార్జి చార్లెస్, సందీప్ పాల్గొన్నారు.