గోదావరిఖనిలో వివేక్​ వెంకటస్వామికి సన్మానం

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ ఘన విజయం సాధించిన నేపథ్యంలో గోదావరిఖనిలో చెన్నూర్​ ఎమ్మెల్యే జి.వివేక్​ వెంకటస్వామికి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు, సింగరేణి కాలరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్కర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకులు ఘన సన్మానం చేసి, శుభాకాంక్షలు చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.రవికుమార్ ఆధ్వర్యంలో లీడర్లు గడ్డం శేఖర్, లక్ష్మీపతి గౌడ్, యాద వెంకటరమణ, సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్, కల్వల శంకర్, తోట లక్ష్మణ్, టి.నారాయణ, పవన్, మాలెం మధు,  తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. 

రామగుండంకు చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్​ గడ్డం మధు ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణను మంచిర్యాలలోని ఆయన నివాసంలో కలిసి కేక్ కట్ చేయించారు. ఆయనతోపాటు లీడర్లు మగ్గిడి దీపక్, భీమ్ సందేశ్, శివ ప్రసాద్, ప్రభాకర్, తదితరులు ఉన్నారు. పెద్దపల్లి ఎంపీగా గెలుపొందిన గడ్డం వంశీకృష్ణ సింగరేణి కాలరీస్​ వర్కర్స్​ యూనియన్​ పక్షాన శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి పరిశ్రమ అభివృద్ధికి కార్మిక సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం కోరారు.

బాధిత కుటుంబాలకు వివేక్​ పరామర్శ

గోదావరిఖని, వెలుగు: రెండు రోజుల కింద అనారోగ్యంతో చనిపోయిన కాంగ్రెస్​ సీనియర్​ లీడర్​, రామగుండం మాజీ కార్పొరేటర్​ దొంతుల లింగం కుటుంబ సభ్యులను చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. గోదావరిఖనిలోని ఫైవింక్లయిన్​ ఏరియాలోని బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి లింగం ఫొటో వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ఓదార్చారు. 

అలాగే రామగుండం కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్​ తల్లి నర్సమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను వివేక్​ పరామర్శించారు. వివేక్ వెంట లీడర్లు గుమ్మడి కుమారస్వామి, పి.మల్లికార్జున్, దుబాసి మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కామ విజయ్, జావిద్​, తదితరులున్నారు.