ట్రైబల్స్​కు ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు ఇస్తున్నాం... ‘వెలుగు’ కథనంపై ట్రైబల్ శాఖ ప్రకటన

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ట్రైబల్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు పీఎం జన్మన్ స్కీం కింద ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డుతో పాటు పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, రేషన్ కార్డులు, పీఎం జనధన్ కింద బ్యాంక్ ఖాతాలు జారీ చేస్తున్నామని ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ ట్రైనింగ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ డైరెక్టర్ సుముజ్వల వెల్లడించారు. గురువారం ‘వెలుగు’దినపత్రికలో ఆదివాసీలకు ఆధార్ తిప్పలు పేరుతో వచ్చిన కథనంపై వివరణ ఇచ్చారు.

రాష్ట్రంలో ఉన్న 548 ట్రైబల్ గ్రామాల్లో ఈ ఏడాది ఆగస్టు 28 నుంచి అక్టోబర్ 2 వరకు క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేసి 56,837 ఆధార్ కార్డులు, 41,026 బ్యాంక్ అకౌంట్లు, 32,118 క్యాస్ట్ సర్టిఫికెట్లు, 1,263 కిసాన్ క్రెడిట్ కార్డులు, 14,502 రేషన్ కార్డులు, 8,442 ఫారెస్ట్ రైట్ యాక్ట్ ( ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ) పట్టాలు ఇచ్చామని ఆమె తెలిపారు. నాగర్ కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 91 ట్రైబల్ గ్రామాల్లో క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్వహించి అన్ని రకాల కార్డులు ఇవ్వడానికి అర్హత ఉన్న ట్రైబల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేటా పీఎం జన్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేస్తున్నామని చెప్పారు.

మున్ననూరు ప్రాంతంలో ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో ఈ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటు చేస్తున్నామని, కార్డులు అందజేయాలని క్యాంప్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జిలకు ఆదేశాలిచ్చామని ఆమె వెల్లడించారు.