నిజామాబాద్‌లో చెట్లు నేలమట్టం.. శ్రీరాంసాగర్ కు భారీ వరద

నిజామాబాద్ జిల్లా: ఉమ్మడి నిజామాబాద్ (కామారెడ్డి, నిజామాబాద్) జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం రికార్ట్ స్థాయిలో భారీ వర్షాలు నమోదైయ్యాయి. భీంగల్ బడా భీంగల్ రహదారి పై చెట్లు కూలిపోయి..

రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భీంగల్ లో కప్పలవాగు  ఉదృతంగా ప్రవహిస్తోంది. బడా భీంగల్ లో సింగడి చెరువు మతడి దూకుతుంది. శ్రీరాంసాగర్ లోకి వరద ప్రవాహం భారీగా పెరిగింది. ఇన్ ఫ్లో 35417క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 2710క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091(అడుగులు 80.5టిఎంసీలు) కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1085.60 (అడుగులు 61.88టీఎంసీలు) నీరు ఉంది.

కామారెడ్డి జిల్లా :

శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కామారెడ్డి నియోజకవర్గంలో పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు ఏరులై పారుతున్నాయి. తాడ్వాయి మండలం సంతాయిపెట్ గ్రామంలో భీమేశ్వర వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. పోచారం ప్రాజెక్టు భారీ ఎత్తున నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుత ఇన్ ఫ్లో 1567 క్యూస్కులు వరద నీరు వచ్చి చేరుతుంది. పూర్తి స్థాయి నీటిమట్టం1464 అడుగులు(1.820  టీ యం సి) కాగా.. ప్రస్తుతం1459 అడుగులు(1.078 టీ యం సి ) నీరు ప్రాచారం ప్రాజెక్ట్ లో ఉంది. రాజంపేట మండలం గుండారం వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న పెద్దవాగు.. గుండారం నుంచి కామారెడ్డికి రాకపోకలు నిలిచిపోయాయి.

నస్రుల్లాబాద్ మండలం బొమ్మ దేవిపల్లిలో రికార్డు స్థాయిలో 13.7 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. బొమ్మదేవి పల్లిలో వరద నీరు ఇళ్లలోకి చేరింది. నీట మునిగిన పంటలు, సబ్ స్టేషన్ లోకి చేరిన నీరు.
సిరికొండలో భారీ వర్షం కారణంగా.. సిరికొండ మండలంలోని గడుకోలు వద్ద కప్పల వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. వరద ప్రవాహానికి అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. రాకపోకలు  నిలిచిపోయాయి.