నిజామాబాద్ సిటీ వెలుగు : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ ని 24 గంటల లోపు ఆసుపత్రిలో చేర్పిస్తే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ ను తొలగించి పక్షవాతం రాకుండా పూర్తిగా నయం చేయడం జరుగుతుందని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్. విష్ణువర్ధన్ అన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్ పై నారాయణ హృదయాలయ హైదరాబాద్ ఆసుపత్రి తో పాటు యూరప్ దేశంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నామన్నారు.
ఈ బ్లడ్ క్లాట్ ను 24 గంటల లోపు తీసివేయడం మొట్టమొదటిసారిగా నిజామాబాద్ విజయ హాస్పిటల్ లో అందుబాటులోకి వచ్చిందని ఆయన తెలిపారు. రెండు నెలల్లో ఇప్పటివరకు ఆసుపత్రిలో ఇద్దరు పేషెంట్లను బ్రెయిన్ స్ట్రోక్ నుంచి సేవ్ చేశామని చెప్పారు.