గుజరాత్ సూరత్‌లో ఘటన
సూరత్: గుజరాత్‌లో రైలు పట్టాలు తప్పించేందుకు దుండగులు కుట్ర పన్నారు. ఇది భగ్నం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. గుజరాత్ వడోదర డివిజన్ లో ఈ ఘటన జరిగింది. సూరత్ కిమ్ రైల్వే స్టేషన్ లో అప్ లైన్ రైల్వే ట్రాక్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ట్యాంపరింగ్ చేశారు.
ట్రాక్‌లోని ఫిష్ ప్లేట్, కీని తొలగించారు. వాటిని తిరిగి అదే రైలు పట్టాలపై ఉంచారు. దీనిని గుర్తించిన రైల్వే సిబ్బంది ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అనంతరం కాసేపటికే ఫిష్ ప్లేట్లను తిరిగి బిగించారు. ఆ తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. దీంతో దుండగులు పన్నిన కుట్ర విఫలమైంది.