కొత్తరకం మోసం..సిమ్ క్లోజ్ చేయాలంటూ..TRAI పేరుతో మేసేజ్లు, కాల్స్

‘‘సిమ్ క్లోజ్ చేయండి’’.. అని మీ మొబైల్ ఫోన్లకు మేసేజ్లు, కాల్స్ వస్తున్నాయా..? TRAI నుంచి ఫోన్ చేస్తున్నాం.. మీ సిమ్ కార్డులను క్లోజ్ చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారా..?  ఇలాంటి మేసేజ్ లపై ట్రాయ్ క్లారిటీ ఇచ్చింది. అలాంటి మేసేజ్ లు, కాల్స్ అన్నీ ఫేక్ అని గుర్తించింది. ఇదంతా స్కామర్ల కుట్రలో భాగమని.. వారి బారిన పడొద్దని  కస్టమర్లను కోరింది. ఇలాంటి కాల్స్ వస్తే.. వెంటనే సంబంధిత టెలికాం ఆపరేటర్ కస్టమర్ కేర్ నంబరును సంప్రదించాలని సూచించింది. 

సిమ్ కార్డు క్లోజ్ చేయండి అని కాల్స్, మేసేజ్ లు విషయంతో కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని TRAI కోరింది. హ్యాకర్లు ప్రజలను మోసగించడానికే ఇటువంటి కాల్స్ చేస్తుంటారని తెలిపింది. ఈ కాల్స్ ద్వారా భయపెట్టి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే కుట్రలో భాగమని చెప్పింది. TRAI పేరుతో పంపిన మోసపూరిత మెసేజ్లను.. మీ సిమ్ కార్డు కేవైసీ వివరాలను అప్ డేట్ చేయాలని.. ఆధార్ నంబర్లతో సహా వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసేందుకు ప్రయత్నిస్తారని తెలిపింది. 

అలాంటి కాల్స్ వస్తే ఏం చేయాలి? 

TRAI ప్రత్యేకంగా అలాంటి మేసేజ్ లు, కాల్స్  చేయదని స్పష్టం  చేసింది.  సిమ్ కార్డు క్లోజ్ చేయాలి అని అన్ని రకాల కాల్స్ నకిలీవని ట్రాయ్ గుర్తించింది.. స్కామర్ల కుట్రలో పడొద్దని హెచ్చరిం చింది. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు అటెంప్ట్ చేయకుండా వదిలివేయాలని తెలిపింది. వెంటనే సంబంధించిన టెలికం ఆపరేటర్లకు సమాచారం ఇవ్వాలని కఃకోరింది. దీంతోపాటు అటువంటి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ సంచార్ సతి పోర్టల్ లో రిపోర్టు చేయాలని సూచించింది. 

ALSO READ | Poco Pad 5G: పోకో నుంచి మొదటి టాబ్లెట్ పీసీ లాంచ్..ధర, ఫీచర్లు ఇవిగో..