అయ్యో హాసిని.. ఎంత పనిచేశావ్ తల్లీ.. భువనగిరిలో విషాద ఘటన

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పట్టణంలో హాసిని అనే విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. హాసిని హైదరాబాద్లో డిగ్రీ చదువుతోంది. నిఖిల్ అనే యువకుడు ఆత్మహత్యను ప్రేరేపించే విధంగా ఫోన్లో అసభ్యకరమైన పదజాలంతో ఫోన్కు మెసేజ్ పంపినట్లు తెలిసింది. ఈ మెసేజ్ చూసి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లుగా పోలీసులకు హాసిని తండ్రి ఫిర్యాదు చేశాడు.

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో ఇదే తరహా ఘటన ఆగస్ట్, 2024లో జరిగింది. బీ ఫార్మసీ చదువుతున్న యువతికి ఇన్స్టాగ్రామ్లో ఓ యువకుడు పరిచయమయ్యాడు..తర్వాత  ప్రేమించమన్నాడు..వెంటపడ్డాడు.. కాదన్నందుకు వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు ఎక్కువవ్వడంతో యువతి బిల్డింగ్ నాలుగో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

జిన్నారం సీఐ సుధీర్ కుమార్ కథనం ప్రకారం.. దోమడుగుకు చెందిన బీ ఫార్మసీ స్టూడెంట్ తేజస్విని (21)తో అదే గ్రామానికి చెందిన శ్రీహరి ఇన్స్టాగ్రామ్లో 5 నెలల  క్రితం పరిచయమయ్యాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఫ్రెండ్లీ చాటింగ్ కొనసాగుతోంది. కొద్ది రోజులుగా ప్రేమిస్తున్నాంటూ తేజస్వినిని శ్రీహరి వేధించడం మొదలుపెట్టాడు. పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు.

Also Read : రోడ్డు స్థలంలో ఇల్లు కట్టాడు

విషయం పెద్దల దృష్టికి వెళ్లడంతో పంచాయితీ పెట్టినా వేధింపులు ఆగ‌‌లేదు. శ్రీహరి వేధింపులు ఎక్కువవ్వడంతో మనస్తాపానికి గురైన తేజస్విని తాను ఉంటున్న బిల్డింగ్ నాల్గో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు సురారంలోని ప్రైవేటు దవాఖానకు తరలించగా అప్పటికే మరణించినట్టు అక్కడి డాక్టర్లు చెప్పారు.