పోలీసులకు ఏమైంది..!.. వరుస ఆత్మహత్యలతో డిపార్ట్​మెంట్​లో కలకలం

  • బాధితులకు బాసటగా
  • నిలవాల్సినోళ్లే బలవన్మరణం 
  • వ్యక్తిగత సమస్యలు, కుటుంబ 
  • కలహాలు, ప్రేమ వ్యవహారాలే కారణం
  • ఈ నెలలో 8 మంది పోలీసుల సూసైడ్​
  • కౌన్సెలింగ్​కు ఆఫీసర్ల ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: నేరగాళ్లలో భయం, ప్రజల్లో మనో ధ్యైర్యాన్ని నింపాల్సిన పోలీసులు కొందరు ధైర్యాన్ని కోల్పోతున్నారు. స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చే బాధితులకు బాసటగా నిలవాల్సిన వారిలో ఆత్మస్థైర్యం సన్నగిల్లుతున్నది. తమ సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత కారణాలు, ఇతర సమస్యలతో అర్ధంతరంగా ప్రాణాలు వదులుతున్నారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పోలీసుల ఆత్మహత్యలు డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలవరపెడుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో ఇట్ల ఎనిమిది మంది చనిపోయారు. ఇలాంటి ఘటనలతో పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆత్మహత్యలకు గల కారణాలపై ఆయా జిల్లా యూనిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నతాధికారుల నుంచి సమగ్ర రిపోర్ట్ సేకరిస్తున్నారు. పోలీస్ సిబ్బందిలో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు కౌన్సెలింగ్ సెషన్స్ నిర్వహించేందుకు చర్యలు చేపడ్తున్నారు. 

కీలక బాధ్యతల్లో ఉన్నా..

పోలీస్ కొలువు అంటే స్టేటస్ సింబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. యూనిఫాం సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోలీస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అత్యంత కీలకమైన వ్యవస్థ. డీజీపీ స్థాయి అధికారి నుంచి హోంగార్డు వరకు ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతుంటారు. విధి నిర్వహణలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా నిలబడతారు. నేరస్తులు, తప్పు చేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటారు. దీంతో పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటేనే  నేరస్తుల ఒంట్లో భయం పడుతున్నది. ఇలాంటి పోలీసులకు గతంలో ఉన్నతాధికారుల వేధింపులు ఎక్కువగా ఉండేవి. పైగా పని ఒత్తిడి ఉండేది. వీటి కారణంగా గతంలో పలువురు పోలీసులు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు తమ పైఅధికారుల నుంచి ఎలాంటి వేధింపులు ఉన్నా స్వేచ్ఛగా ఆపై అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి ఉన్నత విద్యను చదివినవారు కూడా పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనిఫామ్ వేసుకోవాలని కోరుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్​ కొలువులను కూడా పెద్ద పెద్ద చదువులు చదివినవాళ్లు పోటీపడి సెలెక్ట్​ అయ్యారు. అయితే.. పోలీస్ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడ, మగ పోలీసులకు మధ్య ఏర్పడిన పరిచయాలు ప్రేమకు దారితీస్తున్నాయి. దీంతో పాటు ఒకే డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడంతో పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. అయితే.. వృత్తిలో కొందరు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. వీటితోపాటు కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో కొంత మంది పోలీసులు అర్ధంతరంగా ప్రాణాలు వదులుతున్నారు. ఇటీవల జరిగిన కొన్నిఘటనల్లో ఇలాంటి కారణాలు కూడా వెలుగుచూశాయి.
 
వరుస ఘటనలు

ములుగు జిల్లా వాజేడులో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ హరీశ్​ ఈ నెల 4న ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ సాయికుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీబీపేట పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శృతి, కంప్యూటర్ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిఖిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ నెల 25న ప్రాణాలు తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున మెదక్ జిల్లాలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, హనీట్రాప్​, వివాహేతర సంబంధాలు ఆత్మహత్యలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 

అధైర్యపడొద్దు.. సమస్యలు ఉంటే చెప్పండి

“ పోలీస్ సిబ్బంది ఆత్మహత్యలు దురదృష్టకరం. ఇప్పటి వరకు జరిగిన ఆత్మహత్యలకు డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనిఒత్తిడి కారణం కాదు. వారివారి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు, వ్యక్తిగత ఇబ్బందులు, కుటుంబ సమస్యల కారణంగానే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది. ఇలాంటి వారిని గుర్తించి స్థానిక ఉన్నతాధికారులు సీఐలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. సిబ్బంది అధైర్యానికి గురికావద్దు. ఎలాంటి సమస్యలు తలెత్తినా సంబంధిత అధికారులకు తెలియజేయాలి.’’
– డీజీపీ జితేందర్


“ములుగు జిల్లా వాజేడు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ రుద్రారపు హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(29) ఈ నెల 4న ఆత్మహత్య చేసుకున్నాడు. సర్వీస్ రివాల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్లాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాల్చుకున్నాడు. అంతకు ముందు రోజే మావోయిస్టులతో ఎదురొడ్డి పోరాడాడు. కానీ, హనీట్రాప్​లో చిక్కుకొని.. యువతి వేధింపులతో  ఆత్మహత్య చేసుకున్నాడు. యువతి బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన పరువుపోతుందనే అవమానంతో హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు బాధ్యురాలైన యువతిని ఈ నెల 14న పోలీసులు అరెస్ట్ చేశారు.’’

“కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానిస్టేబుల్ శ్రుతి మృతి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ నెల 25న రాత్రి జరిగిన ఈ ఘటనలో వీరిద్దరితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతి చెందడంతో పోలీసులు విచారణ జరిపారు. ముగ్గురు మృతికి ప్రేమ వ్యవహారం కారణమై ఉంటుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దర్యాప్తు చేస్తున్నారు.’’