పండగ పూట విషాదం : పెద్ద పులి వేషం కట్టి గుండెపోటుతో మృతి

జగిత్యాల జిల్లా: మాల్యాల మండల కేంద్రంలో ఆదివారం పండగ పూట విషాదం చోటుచేసుకుంది. మొహారం సందర్బంగా బెజ్జారపు లక్ష్మణ్(24) అనే యువకుడు పెద్దపులి వేషం వేసి ఊరేగింపులో డ్యాన్స్ చేశాడు. పెద్దపులి వేషంలో  డాన్స్ చేసిన తర్వాత లక్ష్మణ్ ఇంటికి వచ్చి మంచంలో పడుకున్నాడు. కుటుంబ సభ్యులు ఎంత పిలిచినా లక్ష్మణ్ ఉలుకూ పలుకు లేదు. 

వెంటనే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే లక్ష్మణ్ గుండెపోటుతో చనిపోయాడని డాక్టర్లు నిర్థారించారు. మృతునికి భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. డ్రైవర్ గా పనిచేస్తున్న లక్ష్మణ్ మొహర్రం పండగ సంర్భంగా పులివేశధారణలో ఊరేగింపులో డ్యాన్స్ చేసి వచ్చి ఇంట్లో గుండెపోటుతో చనిపోయినట్లు బంధువులు చెప్తున్నారు.

ALSO READ | పెండ్లి కావట్లేదనే బాధతో యువతి సూసైడ్