ఏమైంది ఆ స్కూల్‌లో.. వరుసగా విద్యార్థులు చనిపోతున్నారు

జగిత్యాల జిల్లా : మెట్పల్లి మండలం పెద్దాపూర్ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లో తరుచూ విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 6వ తరగతి చదువుతున్న అనిరుద్ అనే విద్యార్థి గురువారం రాత్రి అస్వస్థకు గురైయ్యాడు. ఉపాధ్యాయులు అనిరుద్ ని మెట్పల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. విద్యార్థి శుక్రవారం మృతి‌ చెందాడు. అనిరుద్ స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇదే తరగతికి చెందిన మరో ఇద్దరు విద్యార్థులు కూడా అనారోగ్యం బారిన పడ్డారు. 

వారిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినట్టుగా సమాచారం. గత 15 రోజుల క్రితం అదే పాఠశాలలో ఒక విద్యార్థి మృతి చెందగా.. మరో ఇద్దరికి పాముకాటుకు గురైయ్యారు. ఇలా తరుచూ పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఏదో ఓ విషాదం నెలకొంటుంది. ప్రభుత్వ అధికారులు దీనిపై విచారణ చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థులు అస్వస్థకు గురవ్వడానికి కారణమేంటో ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు.