హైదరాబాద్లో..ఇయ్యాల, రేపు ట్రాఫిక్​ ఆంక్షలు

సికింద్రాబాద్, వెలుగు : రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు పంజాగుట్ట జంక్షన్, గ్రీన్​లాండ్స్, బేగంపేట ఫ్లై ఓవర్, హెచ్​పీఎస్​గేట్, శ్యామ్​లాల్​ బిల్డింగ్, పీపీఎన్​టీ ఫ్లైఓవర్, ఎయిర్​పోర్ట్​ జంక్షన్, మోనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్, కాకతీయ హోటల్, రాజ్​భవన్​రోడ్, మెట్రో రెసిడెన్సీ, వీవీ విగ్రహం, ఖైరతాబాద్ ​ఫ్లైఓవర్, నెక్లెస్​రోడ్, ఎన్​టీఆర్ ​మార్గ్తె

లుగు తల్లి ఫ్లైఓవర్​, కట్టమైసమ్మ టెంపుల్, ఇక్బాల్​మినార్, ఓల్డ్ అంబేద్కర్​ విగ్రహం, ట్యాంక్​బండ్, ఎన్​టీఆర్​ స్టేడియం, అశోక్​నగర్​జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్​ఆంక్షలు అమలులో ఉంటాయి. శుక్రవారం ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం12.15 గంటల వరకు రాజ్​భవన్, వీవీ విగ్రహం

కేసీపీ ఆన్సారీ మంజిల్, తాజ్​కృష్ణ, ఎస్ఎన్​టీ సాగర్​సొసైటీ, ఎన్టీఆర్ భవన్, జూబ్లీ హిల్స్​చెక్​పోస్ట్, కేబుల్ బ్రిడ్జి, రోడ్​నంబరు 65, ఎన్ఎఫ్​సీఎల్, పంజాగుట్ట ఫ్లైఓవర్, మోనప్ప జంక్షన్, ప్రజాభవన్, గ్రీన్​ల్యాండ్స్, బేగంపేట ఫ్లైఓవర్, శ్యామ్ లాల్​భవన్, ఎయిర్​పోర్టు జంక్షన్, బేగంపేట ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతాయి.