వాగులు పొంగితే రాకపోకలు బంద్​

  • రాజన్నసిరిసిల్ల జిల్లాలో 9 మండలాల్లో బ్రిడ్జిలు నిలిచిపోతున్న రవాణా 
  •  చెరువులు, వాగులు పొంగినప్పుడల్లా రోడ్ల మీదకు చేరుతున్న వరద 
  •  రాకపోకలు నిలుస్తుండడంతో జనం ఇబ్బందులు 
  • లోలెవల్ బ్రిడ్జిలను హైలెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిస్తే ప్రయోజనం

రాజన్నసిరిసిల్ల, వెలుగు:  రాజన్నసిరిసిల్ల జిల్లాలో వానొస్తే రాకపోకలు బంద్ అవుతున్నాయి. జిల్లాలో 13 మండలాలు ఉండగా 9 మండలాల్లో  కొంచెం గట్టి వాన పడినా వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. కొన్ని మండలాల్లో బ్రిడ్జిలు లేక రాకపోకలకు అంతరాయం కలుగుతుండగా, మరికొన్ని మండలాల్లో లోలెవల్ బ్రిడ్జిలపై నుంచి నీరు ప్రవహించడం వల్ల నిలిచిపోతున్నాయి. ఫలితంగా వానొస్తే 9 మండలాల్లో  రాకపోకలు నిలిచిపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. 

మండలాల మధ్య నిలుస్తున్న రాకపోకలు 

గతేడాది సెప్టెంబర్ లో కురిసిన భారీ వర్షానికి 9 మండలాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చందుర్తి మండలం, వేములవాడ రూరల్, కోనరావుపేట, బోయినిపల్లి, వేములవాడ, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, తంగళ్లపల్లి మండలాల్లో వర్షాలు పడినప్పుడల్లా వాగులు పొంగి రాకపోకలకు అంతరాయం కలిగింది. చందుర్తి మండలం బండపల్లి చెరువు మత్తడి పోసినప్పుడల్లా కోనరావుపేట–చందుర్తి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. 

వేములవాడరూరల్ మండలం హన్మాజీపేట వాగు పొంగడంతో  వేములవాడ–చందుర్తి మధ్య, నక్కవాగు పొంగడం వల్ల వేములవాడ రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–కోనరావుపేట మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. కోనరావుపేట మండలం నిమ్మపల్లి వాగు, మూలవాగు పొంగి మామిడిపల్లి, నిజాంబాద్, వెంకట్రావుపేట, బావుసాయిపేట, వట్టిమల్ల గ్రామాల మధ్య రాకపోకలు బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. 

బోయినిపల్లి మండలం వాగు ప్రవాహంతో మండలం కేంద్రం నుంచి కొదురుపాక వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే మండలంలోని గంజీవాగు వల్ల వేములవాడ–బోయినిపల్లి మండలాల మధ్య ఆగిపోతున్నాయి. తంగళ్లపల్లి మండలంలో లక్ష్మీపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాగు ఉధృతికి తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో, ఎల్లారెడ్డిపేట మండలంలోని కోరుట్లపేట వాగు గంగమ్మ గుడి వద్ద రోడ్డుపై నుంచి పారడంతో గంభీరావుపేటకు రాకపోకలు నిలుస్తున్నాయి. 

హైలెవల్ బ్రిడ్జిలుగా మార్చాలి 

గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు వద్ద లోలెవల్ బ్రిడ్జి ఉంది. ఏటా ఈ బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో లింగన్నపేట, గంభీరావుపేట, కోళ్లమద్ది, మాచారెడ్డి, గ్రామాల మధ్య రాకపోకలు నిలుస్తున్నాయి. దీనిని హై లెవల్ బ్రిడ్జిగా మారిస్తేనే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయి. ఇదే మండలంలోని మల్లుపల్లి–గోరింటాల గ్రామాల, ముస్తాబాద్  మండలం రామలక్ష్మణపల్లె వద్ద లోలెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జిలను హైలెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జిలుగా మార్చాల్సి ఉంది. 

హామీలకే పరిమితం 

బీఆర్ఎస్ పాలనలో పలుమార్లు ఆయ మండలాల ప్రజాప్రతినిధులు లోలెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జిలను హైలెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చాలని నాటి మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విజ్ఞప్తి చేశారు. ఆ టైంలో తాత్కాలిక రిపేర్లకు అరకొర నిధులు విడుదల చేయించారు. అ పనులన్నీ తాత్కాలికమైనవి కావడంతో వానలు వచ్చినప్పుడల్లా జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. గతేడాది భారీ వర్షాలతో రోడ్ల రిపేర్లకు రూ.80  లక్షలు మంజూరయ్యాయి. వీటితో తాత్కాలికంగా రోడ్లకు రిపేర్ చేశారు. శాశ్వత పరిష్కారం కోసం హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు. 

బోయినిపల్లిలో 


బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో బోయినిపల్లి–వేములవాడ రోడ్డులో స్తంభంపల్లి వద్ద గంజి వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  వాగు పై ఇటీవల బ్రిడ్జి పనులు ప్రారంభించారు. వర్షానికి మట్టి కొట్టుకుపోయింది. స్పందించిన అధికారులు మట్టిపోయించడంతో రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.