కరీంనగర్ లో ట్రాఫిక్‌‌ మళ్లింపు

కరీంనగర్ క్రైం, వెలుగు: ఎంపీ ఎన్నికల కౌంటింగ్‌‌ సందర్భంగా మంగళవారం కరీంనగర్‌‌‌‌లో ట్రాఫిక్‌‌ మళ్లిస్తున్నట్లు సీపీ అభిషేక్ మహంతి తెలిపారు. ఉదయం  6 గంటల నుంచి కౌంటింగ్‌‌ ముగిసేదాకా ఎస్‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ డిగ్రీ కాలేజీ ఎదుట ఉన్న రోడ్డుపై రాకపోకలకు అనుమతి లేదన్నారు.  జగిత్యాల నుంచి కరీంనగర్ వచ్చే వాహనాలు రేకుర్తి చౌరస్తా నుంచి శాతవాహన యూనివర్సిటీ, పద్మ నగర్ మీదుగా సిటీలోకి, తిరుగు ప్రయాణంలో కోర్ట్ కాంప్లెక్స్ దాటగానే జ్యోతినగర్, కెమిస్ట్రీ భవన్, శాతవాహన యూనివర్సిటీ, రేకుర్తి చౌరస్తా మీదుగా వెళ్లాల్సి ఉంటుందన్నారు. 

బ్యాంకు కాలనీలోని డీమార్ట్ రోడ్డు వైపు నుంచి వచ్చే వాహనాలు బ్యాంకు కాలనీ రోడ్డు నంబర్‌‌‌‌ వన్​మీదుగా స్పెన్సర్స్ వద్ద రోడ్డు నుంచి సిటలోకి మళ్లించినట్లు తెలిపారు. కౌంటింగ్‌‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంగళవారం 144 సెక్షన్‌‌  అమలుచేయనున్నట్లు సీపీ తెలిపారు.