గంభీరావుపేటలో 10 రోజులుగా నిలిచిన రాకపోకలు

రాజన్నసిరిసిల్ల, వెలుగు: గంభీరావుపేట మండలకేంద్రం– లింగన్నపేట గ్రామాల మధ్య 10 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. గత సర్కార్ హయాంలో లింగన్నపేట వాగుపై లోలెవెల్ బ్రిడ్జిని హైలెవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చేందుకు నిర్ణయించి టెండర్లు పిలిచారు.

అయితే టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోలెవెల్ బ్రిడ్జిని కూల్చేసి పక్కన తాత్కాలికంగా మట్టి రోడ్డు వేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మట్టి రోడ్డు కూలడంతో మండలకేంద్రంతో రాకపోకలు తెగిపోయాయని లింగన్నపేట గ్రామస్తులు వాపోతున్నారు.