ప్రభుత్వమే నిజాం షుగర్స్​ ఫ్యాక్టరీని నడపాలి

బోధన్, వెలుగు: నిజాం షుగర్స్​ ఫ్యాక్టరీని ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని, తన ఆధ్వర్యంలో నడిపించాలని కార్మిక సంఘం లీడర్లు డిమాండ్​చేశారు. ఫ్యాక్టరీ కార్మికులు శుక్రవారం సమావేశమై పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్​రెడ్డి నిజాం షుగర్స్​పై కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఫ్యాక్టరీని పరిశీలించడానికి వచ్చే కమిటీ సభ్యులకు తమ సమస్యలను విన్నవించాలని నిర్ణయించారు.

ఫ్యాక్టరీ లే ఆఫ్​​ అయిన నుంచి ఇప్పటి వరకు కార్మికులకు జీతాలు చెల్లించాలని, వారిని  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఫ్యాక్టరీ మూతపడిందన్న బాధతో హార్ట్​ఎటాక్​తో చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కమిటీ సభ్యులకు విన్నవించనున్నట్లు కార్మిక సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఉపేందర్, నాగుల రవిశంకర్​ గౌడ్, రహామత్​అలీ, బాలకృష్ణ, శ్రీనివాస్, ప్రకాశ్, అనిల్​కుమార్, స్వామి, ఖాజా పాల్గొన్నారు.