ఎస్‌‌‌‌బీఐలో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్స్​

స్టేట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా(ఎస్‌‌‌‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌‌‌‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌‌‌‌మెంట్, కార్పొరేట్ సెంటర్  రెగ్యులర్ ప్రాతిపదికన 150 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్​ చేసింది. ఆన్​లైన్​లో అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.

అర్హతలు : ఏదైనా విభాగంలో డిగ్రీ, ఐఐబీఎఫ్‌‌‌‌ ఫారెక్స్‌‌‌‌ సర్టిఫికేట్‌‌‌‌తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్‌‌‌‌లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. వయసు  23 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.  నెలకు రూ.48,170- నుంచి రూ.69,810 జీతం చెల్లిస్తారు.

దరఖాస్తులు : అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జూన్​ 27 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్‌‌‌‌ షార్ట్‌‌‌‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వివరాలకు www.sbi.co.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.