మానకొండూరు మానేరులో మునిగిన ఇసుక ట్రాక్టర్లు

మానకొండూర్, వెలుగు: ఎల్‌‌ఎండీ గేట్లు తెరవడంతో పెరిగిన ఉధృతిలో ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లు మునిగాయి. డ్యాం మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్ శివారులోని మానేరు వాగులోకి శనివారం రాత్రి ఓ ముగ్గురు ఇసుక తరలించేందుకు మూడు ట్రాక్టర్లతో వెళ్లారు. ఇసుక నింపి తీసుకొస్తుండగా ఒక్కసారిగా ప్రవాహ ఉధృతి పెరగింది. దీంతో ట్రాక్టర్లను అక్కడే వదిలేసి ఒడ్డుకు చేరుకున్నారు.

ఆదివారం గేట్లు మూయడంతో ఓ భారీ క్రేన్‌‌ సహాయంతో మునిగిన ట్రాక్టర్లను బయటకు తీసుకొచ్చారు. వీటిలో రెండు ట్రాక్టర్లు బయటకు రాగా.. మరొకటి నీటిలోనే ఉన్నట్లు స్థానికులు తెలిపారు.