కోరుట్ల తహశీల్దార్ కార్యాలయంలో చోరి

జగిత్యాల జిల్లా  కోరుట్ల తహశీల్దార్​ కార్యాలయంలో దొంగలు పడ్డారు. ఆఫీసు ఆవరణలోని ఉన్న ట్రాక్టరును దొంగిలించారు.  పూల వాగునుంచి ఇసుక అక్రమరవాణా చేస్తున్న ట్రాక్టర్​, జేసీబీ ను రెవిన్యూ అధికారులు పట్టుకుని సీజ్ చేసి రెవిన్యూ కార్యాలయంలో ఉంచారు.   ట్రాక్టర్​ యజమాని ఆఫీసులో ఎవరూ లేని సమయం చూసి అనుమతి లేకుండా తీసుకెళ్లడు. అయితే ట్రాక్టర్​ చోరీకి గురైందని తెలుసుకున్న పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమయ్యారు.  విషయం తెలుసుకున్న  ట్రాక్టర్​ యజమాని రెవిన్యూ అధికారులకు లొంగిపోయి తానే తీసుకెళ్లనని చెప్పడంతో.. యజమానికి జరిమానా విధించారు.