పొలం దున్నుతుండగా బావిలో పడి ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతి

వేములవాడ రూరల్, వెలుగు: పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌‌‌‌ బావిలో పడడంతో ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌‌‌‌ మండలం నూకలమర్రి గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన కైర శేఖర్‌‌‌‌గౌడ్‌‌‌‌ (28) ఆదివారం ట్రాక్టర్‌‌‌‌తో భూమయ్య అనే రైతు పొలాన్ని దున్నుతున్నాడు.

ఈ క్రమంలో ట్రాక్టర్‌‌‌‌ను రివర్స్ చేస్తుండగా అదుపుతప్పి పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. దీంతో శేఖర్‌‌‌‌గౌడ్‌‌‌‌ అక్కడికక్కడే చనిపోయాడు. గమనించిన స్థానిక రైతులు పోలీసులు, ఫైర్‌‌‌‌ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బావిలో నుంచి నీటిని బయటకు తోడి మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. మృతుడికి భార్య మౌనిక, ఇద్దరు కుమారులు ఉన్నారు.