ప్రజాతీర్పు బీఆర్​ఎస్​కు చెంపపెట్టు : మహేష్ కుమార్ గౌడ్

పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల ఫలితాలు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు చెంపపెట్టుగా పరిణమించాయి.  గత అసెంబ్లీ  ఎన్నికల్లో పరాజయం పాలై,  అస్తిత్వం కోసం  కొట్టుమిట్టాడుతున్న బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు  నాలుగు నెలల తర్వాత జరిగిన పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ప్రజలు తిరస్కరించడం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ శ్రేణులను నిర్ఘాంతపరిచింది.  మొదటి నుంచి  ఊహించిన ఫలితాలే ఇవి.  అయితే,  ఈ ఎన్నికల్లో  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఒక్క సీటునైనా గెలవకపోవచ్చని రాజకీయ ఉద్ధండులే కాదు.  సాధారణ  ప్రజలు కూడా  ఫలితాలు ముందు అంచనా వేశారు.  

ఈ అంచనాలకు  తగినట్లే  ఫలితాలు రావటం  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు  కోలుకోలేని  దెబ్బగా పరిణమించింది.  సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ కంటోన్మెంట్‌‌‌‌‌‌‌‌ ఉపఎన్నికలో సిట్టింగ్‌‌‌‌‌‌‌‌ సీటును బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌  కోల్పోవడం మూలిగే నక్కపై  తాటిపండు పడినట్లయింది.  కంటోన్మెంట్‌‌‌‌‌‌‌‌ స్థానంతోపాటు, 15 పార్లమెంటు స్థానాల్లో 3వ స్థానానికి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పడిపోయిందంటే ఆ పార్టీపై  ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నదో స్పష్టమవుతున్నది.  ఒక్క సీటు కూడా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌  గెలవకపోవడంతో  ఆ పార్టీ ఈ ఎన్నికల్లో ఎంఐఎం కంటే తక్కువకు  దిగజారి 4వ  స్థానానికి పడిపోయింది.  

గత  డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎ న్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఓటమి పాలైంది.  ఈ ఓటమిని హుందాగా స్వీకరించి,  ప్రజలు తమకిచ్చిన ప్రతిపక్ష హోదా పాత్రను వారు సమర్థంగా నిర్వహించలేదు. ఓటమిని గుణపాఠంగా స్వీకరించాల్సిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకత్వం అహంకారం ఏమాత్రం వదలకుండా, ఇష్టానుసారం అధికార కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌పై,  ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించకుండా.. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వంపై శాపనార్థాలకు దిగారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమకు 105 సీట్లు వస్తాయని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయంటూ దొరహంకారం ఏమాత్రం తగ్గకుండా మాట్లాడారు. జాగీరుగా భావించారు

ప్రాణాలకు తెగించి తెచ్చుకున్న  రాష్ట్రాన్ని అభివృద్ధి 

చేయటానికి,  ఉద్యోగ, ఉపాధి అవకాశాలు  మరింతగా  కల్పించటానికి,  ప్రజలు తమకు  అధికారాన్ని అప్పగించారని కేసీఆర్‌‌‌‌‌‌‌‌ భావించలేదు. ఈ రాష్ట్రాన్ని తమ జాగీరుగా,  ఈ రాష్ట్రానికి తాము మహారాజులమని వారు భావించారు.  అధికారం తమకు శాశ్వతమని భావించారు.  తాము రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసినా,   కుటుంబం మొత్తం పదవులు తీసుకొని  రాజభోగాలు అనుభవిస్తున్నా, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులను మోసం చేసినా ప్రజలు గుడ్డిగా తమకే ఓట్లు వేసి గెలిపిస్తారని విర్రవీగారు.  

తెలంగాణ  ప్రజలకు తమ కుటుంబమే  దిక్కని కేసీఆర్‌‌‌‌‌‌‌‌  భావించారు. గత పదేండ్లుగా  అహంకారం  తలకెక్కించుకొని  నిరంకుశ పాలనను సాగించారు. ఉద్యమకారులు,  త్యాగాలు చేసిన కుటుంబాలను నిర్లక్ష్యం చేశారు. అధికారం చేజిక్కిన మరుక్షణం తనకు కుటుంబమే ముఖ్యం తప్ప ప్రత్యేక రాష్ట్రం కోసం త్యాగం చేసినవారు కాదని నిరూపిస్తూ  కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పాలించారు.

 అడుగడుగునా అబద్ధాలు

గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మొత్తం అబద్ధాలే ప్రచారం చేసింది.  గత పదేండ్లలో తాము చేసిన అభివృద్ధిని చెప్పకుండా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి వస్తే కరెంట్‌‌‌‌‌‌‌‌ ఉండదని,  రైతుబంధు రాదని,  మత కలహాలు జరుగుతాయని,  ఢిల్లీ నుంచి పాలన సాగుతుందని,  ఏడాదికో  ముఖ్యమంత్రి మారతారని  ప్రచారం చేశారు.  ఈ మాటలను  ప్రజలు ఏమాత్రం నమ్మలేదు.  

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కే  ప్రజలు పట్టం కట్టారు. అయినా, బుద్ధి తెచ్చుకోకుండా మళ్లీ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో  రాష్ట్ర ప్రభుత్వంపై అదే అబద్ధాలు ప్రచారం చేశారు. ఈ నాలుగు నెలల్లోనే  రాష్ట్రం నాశనమైందని,  కరెంటు లేదని,  పంటలు ఎండిపోతున్నాయని,  రైతుబంధు ఇవ్వటం లేదని, వడ్లు కొనడం లేదని, తాగటానికి  మంచినీళ్లు లేవని,  ఈ విధంగా అడుగడుగునా అబద్ధాలు ప్రచారం చేశారు.  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకులు చెబుతున్న ఈ అబద్ధాలను ప్రజలు నమ్మలేదు.  నాలుగు నెలలకే వాగ్దానాల్ని అమలు చేయడం లేదని, పాలనను పదేండ్ల వెనక్కు తీసుకెళ్లారని విమర్శించారు. ఈ విమర్శలను ప్రజలు గుడ్డిగా నమ్ముతారని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అంచనా వేసింది. అయితే,  కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ కో  అబద్ధాలను ప్రజలు తమ ఓట్లుతో తిప్పికొట్టారు. 

బీఆర్ఎస్​కు కర్రుకాల్చి  వాత

కేసీఆర్​లో తగ్గని​ అహంకారాన్ని చూసే ఉప ఎన్నికలో,  పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో  ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ప్రజలు తీర్పిచ్చారు.  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు  ప్రజలు మరోసారి  కర్రు కాల్చి వాతపెట్టారు. మాకన్నా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు 1.8శాతం ఓట్లే ఎక్కువగా వచ్చాయని,  ఈ ప్రభుత్వం  త్వరలోనే కూలిపోతుందని,  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు పాలన చేతకావడం లేదని,  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ని గెలిపించి ప్రజలు తప్పు చేశారని,  పాలిచ్చే బర్రెను వదిలి తన్నే దున్నపోతుని తెచ్చుకు న్నారంటూ కేసీఆర్​ తీవ్ర విమర్శలు చేశారు.  

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను  గెలిపించడమే  ప్రజల తప్పు అనడమంటే,  ప్రజాతీర్పును అవమానిం చడం కాదా?   ప్రజలు తమ తప్పును తెలు సుకున్నారని,  కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను ఓడించి నష్టం చేసుకున్నామని  ప్రజలు బాధపడుతున్నా రంటూ కేటీఆర్‌‌‌‌‌‌‌‌,  హరీశ్​రావు వ్యాఖ్యానించా రు.  తాము తప్ప ఈ రాష్ట్రాన్ని పాలించటం ఎవరికీ  చేతకాదని కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కుటుంబం ఇప్పటికీ భావిస్తోంది.  ఇది  దొరల అహంకారానికి,  పెత్తందారుల పోకడకు నిలువెత్తు నిదర్శనం కాదా?   

ప్రొ.కోదండ్​రామ్​ను అర్ధరాత్రి​ అరెస్టు చేయించిన కేసీఆర్​

తాము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండవద్దని, ప్రశ్నించే గొంతుకే ఉండవద్దనే విధంగా పాలన సాగించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేసుకొని ప్రతిపక్షాలకు ప్రశ్నించే అవకాశమే లేకుండా చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు గొంతెత్తితే  మొత్తం  ప్రతిపక్షాన్ని సమావేశాలు ముగిసేవరకూ  సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేసి సమావేశాలు ఏకపక్షంగా నిర్వహించుకున్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలను బెదిరించి, భయపెట్టి, తమ పార్టీల్లోకి ఫిరాయింపు చేసుకుని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. 

ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై ధర్నాలకు పిలుపునిస్తే అర్ధరాత్రి వారి ఇండ్లపై పడి తలుపులు పగలగొట్టి పోలీసులు అరెస్టులు చేసి తీసుకొనిపోయారు. ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్‌‌‌‌‌‌‌‌ చేసి వారి కదలికలను గమనించి, వారు ఇళ్లల్లోంచి బయటకు రాకుండా కట్టడి చేశారు. వేల మంది ప్రతిపక్ష నాయకులు, పత్రికాధినేతల ఫోన్లను ట్యాప్‌‌‌‌‌‌‌‌ చేసి వారిని బెదిరించి అరాచకాలకు పాల్పడ్డారు.  తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ నాయకుడిగా ఉద్యమాన్ని నడిపించిన ప్రొ. కోదండరామ్‌‌‌‌‌‌‌‌ను అర్ధరాత్రి ఇంటిపై పడి తలుపులు పగలగొట్టి,  టెర్రరిస్టునో,  గూండానో తీసుకెళ్లినట్లు అత్యంత అవమానకరంగా అరెస్టు చేయించి పోలీసు స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లారు. 

ఆయన చేసిన నేరం ఏమిటంటే.. ప్రజా సమస్యలపై ధర్నాకు పిలుపునివ్వడమే. అధికారం ఉన్నప్పుడు ధర్నాలన్నా, ఉద్యమాలన్నా లేక ప్రశ్నించే వ్యక్తులన్నా వారిని టెర్రరిస్టుల మాదిరిగా భావించి ప్రజా గొంతుకను అణచివేసి, ఈరోజు ప్రశ్నించే గొంతుక కావాలనటం చూసి తెలంగాణ ప్రజలు హేళన చేస్తున్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను ఓడించి తప్పు చేశామని ప్రజలు అనుకుంటున్నట్లు ఎన్నికల్లో ప్రచారం చేశారు. అదే నిజమైతే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు మెజారిటీ సీట్లు కట్టబెట్టిన ప్రజలు బీఆర్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌కు ఒక్క సీటు కూడా ఎందుకు ఇవ్వలేదు? 

‑ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ