మాజీ మంత్రిని కలిసిన టీపీసీసీ ప్రెసిడెంట్

నిజామాబాద్, వెలుగు : మాజీ మంత్రి, బోధన్​ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్​రెడ్డిని టీపీసీసీ ప్రెసిడెంట్​బొమ్మ మహేష్​గౌడ్​మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు పదవిరావడానికి సహకరించినందుకు సోమవారం హైదరాబాద్​లోని ఆయన ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు.   పా ర్టీని మరింత బలోపేతం చేయడంలో అందరినీ కలుపుకొని వెళ్లాలని సూచించారని మహేశ్​గౌడ్​ తెలిపారు.

సుదర్శన్​ రెడ్డిని కలిసివారిలో స్టేట్​కోఆపరేటివ్​ యూనియన్​ ప్రెసిడెంట్​ మానాల మోహన్​రెడ్డి, టీపీసీసీ జనరల్​ సెక్రటరీ గడుగు గంగాధర్, ప్రచార కమిటీ సభ్యుడు బి.శ్రీనివాస్, ముత్యంరెడ్డి తదితరులు ఉన్నారు.