సాగర్కు పోటెత్తిన పర్యాటకులు.. భారీగా ట్రాఫిక్ జామ్.. పట్టించుకోని పోలీసులు

ఎగువ నుంచి వస్తున్న వరద నీటీతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించికుంది..దీంతో పర్యాటకులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజుకావడంతో సాగర్ డ్యాం,పరిసర ప్రాంతాల ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు భారీగా వచ్చారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ క్లియర్ చేయకుండా పోలీసులు చోద్యం చూస్తున్నారని పర్యాటకులు, స్థానికులు అంటున్నారు.

ప్రాజెక్టు వద్ద, విద్యుత్ కేంద్రం వద్దకు కేవలం పోలీసుల కుటుంబ సభ్యులు, బంధువుల వాహనాలు మాత్రమే పంపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వందల కిలోమీటర్లు నుంచి వచ్చిన వాహనాలను అనుమతించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మీడియాను కూడా లోనికి రానివ్వడం లేదు. దీంతో పర్యాటకులు పిల్లలతో సహా ఎండలో భారీ ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పోలీసులు బూతులు తిడుతున్నారని పర్యాటకులు మండిపడ్డారు.