Top 10 Searched Recipes: గూగుల్ సెర్చ్ 2024.. టాప్ 10 వంటకాల్లో..మన ఉగాది పచ్చడి..మ్యాంగో పికిల్

గూగుల్ సెర్చ్..ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి దీని గురించి బాగా తెలుసు. మనలో చాలామంది ఏ సమాచారం కావాలన్ని గూగుల్ మీద ఆధార పడతాం..గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో కి వెళ్లి మన కావాల్సిన సమాచారాన్ని వెతుకుతాం..అన్ని తెలిసిన ఎంటైటీగా మారింది గూగుల్.. ఎంతలా అంటే..మనం తినే విధానాన్ని కూడా గూగుల్ లో వెతుకుతున్న సందర్భాలు చాలా. ఏం తినాలి..ఎలా తినాలి అని రకరకాల ప్రశ్నలతో గూగుల్ ను సెర్చ్ చేస్తాం. ఏది కావాలన్నా ఒక్క బటన్ తో మనకు అవసరమైన డేటాను అందిస్తుంది.

గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా ప్రతి ప్రతి యేటా 2ట్రిలియన్ల శోధనలు జరుగుతున్నాయట..ఈ ఏడాది (2024) కూడా గూగుల్ సెర్చింగ్ ఇంకా అంతకంటే ఎక్కవుగా జరిగాయట. అయితే వీటిలో ప్రజలు ఎలా జీవిస్తున్నారు.. ఏమి వెతుకుతున్నారు అనే సమాచారాన్ని గూగుల్ ఇయర్ఆఫ్ సెర్చ్ గా భద్ర పరుస్తుంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు,  దేశాల్లో ప్రతి ఏటా జనాదరణ పొందిన సెర్చింగ్ పదాలు, వ్యక్తులు, అంశాలను మనకు తెలియజేస్తుంది.

ALSO READ | Good Health: ఆలుగడ్డ బోలెడు అందాన్ని ఇస్తుంది.. చర్మంపై ముడతలను మాయం చేస్తుంది!

2024లో ఇండియన్లు తమ ఇంట్లో ఏమి వండాలనకున్నారో చూపిస్తూ.. ఆకట్టుకునే వం టకాలు, పానియాలను లిస్టును వెల్లడించింది గూగుల్. అవేంటో చూద్దాం. 

మామిడి కాయ పచ్చడి.. 

మామిడి కాయ పచ్చడి.. ఇదే లేకుండా ఏ వంటిల్లు ఉండదు.. ఎల్లప్పుడు అందుబాటులో ఉండేది మామిడి పికిల్.. దీనిని కొన్ని రాష్ట్రాల్లో పచ్చి మామిడితో పుల్లని మామిడి ఊరగాయను ఇష్టపడతారు. మరికొన్ని రాష్ట్రాల్లో బెల్లంతో , పండ్లతో పచ్చడి పెడతారు. ఇలా రకరకాలుగా మామిడి కాయ పచ్చడిని పెడుతుంటారు. ప్రతి ఇంట్లో ఈ ఊరగాయ లేనిదే భోజనం చేయరు.. అటువంటి మామిడి కాయ పికిల్ ను 2024లో గూగులసెర్చ్ ఇంజిన్ ద్వారా అత్యధికంగా వెతికిన అత్యంత జనాదరణ పొందిన వంటకంగా నిలిచింది. 

ధనియా పంజిరి

ధనియా పంజరి..దీనిని అనేక రూపాల్లో తయారు చేస్తారు. ఇది గ్రౌంగ్ కొత్తమీర గింజలు , నెయ్యితో తయారు చేయబడుతుంది. శీతాకాలంలో ఈ వంటకాన్ని ఎక్కువగా తింటుంటారు.. పంచ అంటే ఐదు, జిరాకా అంటే మూలికలు అని అర్థంలో పంజరి అని పేరు వచ్చింది. ధనియా పంజిరి అనేది సాధారణంగా జన్మాష్టమి ప్రసాదం లేదా కహ్నాస్ భోగ్ గా అందించే ప్రత్యేకమైన వంటకం. ఇది కూడా 2024లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా వెతికిన ఇండియన్ రెసిపీ. 

ఉగాది పచ్చడి

భారతీయ అనేక పండుగల్లో ప్రముఖమైనది ఉగాది ఒకటి.. దక్షిణ భారత దేశంలో జరుపుకుంటారు. ఈ ఉగాది పచ్చడి పానియం ఏపీ, తెలంగాణలో ప్రజలకు ఎంతో ఇష్టమైనది. ఆరు విభిన్న రుచుల మిశ్రమం ఈ పచ్చడి. పచ్చి మామిడి, చింతపండు, బెల్లం, ఉప్పు, పచ్చి మిర్చి, వేపపూత, ఆకులు, నీటితో దీనిని తయారు చేసుకుంటారు.. ఈ ఉగాది పచ్చడి కూడా 2024లో గూగుల్ ఇంజిన్ లో వెతికిన టాప్ 10వంటకాలలో ఒకటి.

ALSO READ | Hyderabad Dishesh:ప్రపంచం మెచ్చిన ఫుడ్లో..హైదరాబాద్ బిర్యానీ..తినరా మైమరిచి..లొట్టలేసుకుంటూ

2024 లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో వెతికిన, ప్రజాదరణ పొందిన  టాప్ 10 వంటకాల్లో చర్నామృతం, ఈమదత్షి, ఫ్లాట్ వైట్,కంజి, శంకరపాలి,చమ్మంతి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.