టూల్స్ గాడ్జెట్స్..ఆర్గనైజర్​ షెల్ఫ్​

ఆర్గనైజర్​ షెల్ఫ్​

కిచెన్​లో టీ, కాఫీ, మసాలా, ఉప్పు, కారం వేసిన చిన్న చిన్న టిన్స్​ పెట్టుకునేందుకు అదనంగా ఒక షెల్ఫ్​ ఉంటే బాగుండు అనిపిస్తుంది ఒక్కోసారి. అలాంటప్పుడు ఎంతో యూజ్​ఫుల్​గా ఉండే మ్యాగ్నెటిక్​ షెల్ఫ్​ బెటర్​ అంటోంది ఆర్గనైజ్​మీ అనే కంపెనీ. ఎందుకంటే వాళ్లు తయారుచేసిన ఒక్కో మ్యాగ్నెటిక్​ షెల్ఫ్​ ​25X12 సెంటీమీటర్​ ఉండి అరకేజీ బరువు ఉంటుంది.

దీన్ని ఫ్రిజ్​, ఒవెన్​, వాషర్​... ఇలా వేటికైనా అతికించేయొచ్చు. హై క్వాలిటీ అల్లాయ్​ స్టీల్​తో తయారైన ఈ ఫ్లోటింగ్​ షెల్ఫ్​ చాలా స్ట్రాంగ్​గా ఉంటుంది. అంతేకాకుండా ఈ షెల్ఫ్​ వెనక అతికించేందుకు వీలుగా రెండు వైపులా స్ట్రాంగ్​ మ్యాగ్నెట్​ ఉంటుంది. కాబట్టి దీన్ని అమర్చేందుకు ఫ్రిజ్​, వాషర్​, ఒవెన్​లకు హోల్స్ చేయాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఇలాంటి షెల్ఫ్​ తక్కువ కిచెన్​ స్పేస్​ ఉన్న ఇళ్లకు ఎంతో ఉపయోగకరం. అపార్ట్​మెంట్స్​లో ఎక్స్​ట్రా స్టోరేజ్​ కోసం బెటర్​ ఆప్షన్​ అని చెప్పొచ్చు.      

ఒక్క షెల్ఫ్​ ధర: 725 రూపాయలు

రూఫ్​ లీకేజ్ అరెస్ట్​ !

రూఫ్​ లీకేజ్​ సమస్య వర్షాకాలంలో ఎక్కువ. ఆ సమస్యకు చెక్​ పెట్టేందుకు ఫీడ్​ఫైర్​ కంపెనీ వాటర్​ప్రూఫ్​ లీకేజ్​ టేప్ తయారుచేసింది​. సిల్వర్​ రంగులో ఉండే ఈ టేప్​ అల్యూమినియం, రబ్బర్​తో తయారైంది. దీన్ని ఇంటి కప్పులకే కాదు గోడలకు కూడా వాడొచ్చు. అల్యూమినియం ఫాయిల్​లా ఉండే ఈ  టేప్​ హై పాలీమర్​ సింథసిస్​ బ్యుటైల్​ గ్లూతో ఉండి.. గట్టిగా అతుక్కుపోతుంది. ఈ వాటర్​ ప్రూఫ్​ అల్యూమినియం ఫాయిల్​ టేప్​ని గ్లాస్, సిమెంట్, టైల్​, ప్లాస్టిక్​, మెటల్​, నీళ్లలో ఉన్న చెక్క ఇలా వేటిపైన అయినా అతికించొచ్చు.

వాటర్​ప్రూఫ్​ మెటీరియల్​తో తయారుచేయడం వల్ల టేప్​ మీద నీళ్లు పడ్డా ఏమీ కాదు. టేప్​ మీద కాలు పెట్టినా జారదు. ఎలాగైనా వంచొచ్చు. అందుకని ఎగుడుదిగుడు ప్రాంతాల్లో, మూలల్లో ఎక్కడ లీకేజ్​ ఉన్నా ఈ టేప్​ను అంటించడం ఈజీ అవుతుంది. కిటికీల దగ్గర ఖాళీ ఉండి గాలి లోపలికి వస్తున్నా అక్కడా అతికించొచ్చు.

ధర: 149 రూపాయలు

ఓల్టేజ్​ ప్రొటెక్టర్​

కరెంట్​ సప్లయ్​లో హెచ్చుతగ్గులు వస్తే గృహోపకరణాలు పాడయిపోతాయి. ఇలాంటప్పుడు ఓల్టేజిలో హెచ్చుతగ్గుల ప్రభావం పడకుండా ఇంట్లో ఉండే ఎలక్ట్రికల్​ వస్తువులను కాపాడేందుకు గాడిటెస్​ ఓల్టేజి ప్రొటెక్టర్​ ప్రొ సిరీస్​ తెచ్చింది. ఆటో రికవరీ ఎల్​ఇడి డిస్​ప్లే ఉన్న ఓల్టేజ్​ ప్రొటెక్టర్​ సింగిల్​ ఫేజ్​ 220 ఓల్ట్​, 63 ఎ 1ఫేజ్​ హెవీ డ్యూటీతో పనిచేస్తుంది.  ఓవర్​, అండర్​ ఓల్జేజ్​లతో పాటు ఓవర్​లోడ్​ ప్రొటక్షన్​ కూడా ఇస్తుంది. ఓవర్​ ఓల్టేజ్​ 130 నుంచి 300  వరకు, అండర్​ ఓల్టేజ్​ 125 నుంచి 229 వరకు ప్రొటెక్ట్​ చేస్తుంది.

అంతేకాకుండా 1 నుంచి 63 యాంపియర్ల వరకు ఓవర్​ కరెంట్​ ప్రొటెక్షన్​ ఉంది.  ఆటో రీకనెక్ట్ ఫీచర్​తో ఉన్న ఈ డివైస్​ వల్ల వోల్టేజ్ హెచ్చుతగ్గులను ఇన్​స్టంట్​గా పవర్​ సప్లయ్​ కటాఫ్​ చేస్తుంది. పవర్​ సప్లయ్​ నార్మల్​ అయ్యాక సప్లయ్​ను ఆటోమేటిక్​గా ఒకటి నుంచి 900 సెకన్లలోపు రీ కనెక్ట్​ చేస్తుంది. ఎటువంటి అంతరాయం ఉండదు. అంతేకాకుండా మీ అవసరాలకు తగ్గట్టు రీ కనెక్ట్​ టైం, కటాఫ్​ వాల్యూల​ను కస్టమైజ్​ చేసుకోవచ్చు. ఈ డివైజ్​ మ్యాగ్జిమమ్​ సస్టెయినబుల్​ వోల్టేజ్​ 440 ఓల్ట్​లు. అంటే సేఫ్టీ రేంజ్​ లోపల పనిచేసేలా ఇది తయారైంది.  ఈ ప్రొడక్ట్​ మాన్యుఫ్యాక్చరింగ్​ లోపాలేమైనా ఉంటే ఏడాది వరకు వారెంటీ ఉంది.

ధర: 1389 రూపాయలు

సింక్​కి టేప్ సీలింగ్​ ​

కిచెన్​ సింక్​ దగ్గర గిన్నెలు కడిగాక, హాల్​ వాష్​ బేసిన్​ దగ్గర చేతులు కడుక్కున్న తరువాత కింద నీళ్లు పడి చిత్తడిగా అవుతుంది. పెద్దవాళ్లు, చిన్న పిల్లలు జారిపడే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటప్పుడే మీకు కౌల్​కింగ్​ సీలింగ్​ టేప్​ అతికించేయాలి. కనుర్వెన్​ కంపెనీ తెచ్చిన ఈ ​​ పీవీసీ సెల్ఫ్​ అడెహెసివ్​ స్ట్రిప్​ని కిచెన్​ సింక్​ ప్లాట్​ఫామ్​, టాయిలెట్, బాత్​రూమ్​ షవర్​, బాత్​ టబ్​ దగ్గర... నీళ్లు ఎక్కడైతే పడతాయో అక్కడ వాడొచ్చు. ఈ స్ట్రిప్​ టేప్​ 3.2 మీటర్లు ఎత్తు 3.8 సెంటీమీర్లు వెడల్పుతో తెలుపురంగులో దొరుకుతుంది. ఈ మెటీరియల్​ ఎటంటే అటు వంగుతుంది. అందుకని దీన్ని మూలల్లో కూడా వాడొచ్చు. గోడల మూలల్లో ఎక్కడ గ్యాప్స్​ ఉన్నా ఈ టేప్​ అతికించేయొచ్చు. ఎక్కడ తేమ అవుతుందంటే అక్కడ అతికించేయడమే.

కాకపోతే అతికించేముందు ఆ ప్రాంతాన్ని బాగా శుభ్రం చేయాలి. బాగా అతుక్కోవాలంటే హెయిర్​డ్రయ్యర్​ వాడొచ్చు. ఒకసారి అతికించాక12 గంటలు దానిమీద నీళ్లు పడకూడదు. ఇది వాటర్​ప్రూఫ్​ టేప్​. పీవీసీ, యాక్రిలిక్​ సీలెంట్​తో తయారైన ఇది హీట్​​ రెసిస్టెంట్. అందుకని​ కిచెన్​ గట్టు వేడి వల్ల టేప్​ పాడవుతుందని ఆలోచించాల్సిన అవసరంలేదు​. ఇది డెకొరేటివ్​ లైన్​లా ఉంటుంది. కిచెన్​లోనే కాకుండా బాత్​, సింక్​,  షవర్​,​ బాత్​టబ్​, గ్యాస్​స్టవ్ ల దగ్గర వాడొచ్చు.

ధర: 249 రూపాయలు