ఎండాకాలం వచ్చిందంటే సిటీల్లోని స్విమ్మింగ్ పూల్స్, పల్లెల్లోని చెరువులు, కుంటలు జనాలతో కళకళలాడుతుంటాయి.ఈత నేర్చుకోవడానికి పిల్లలు, సరదాగా స్విమ్ చేయడానికి పెద్దలు వస్తుంటారు. అయితే.. నీళ్లలో హాయిగా తేలిపోవాలని ఉంది. కానీ ఈత రాదు అనుకునే వాళ్ల కోసం కొన్ని టూల్స్ ఉన్నాయి.అలాగే ఈత వచ్చిన వాళ్ల సేఫ్టీ కోసం ఇంకొన్ని టూల్స్ ఉన్నాయి. అవేంటంటే..
స్విమ్మింగ్ కిట్
ఈత తెలిసినా, తెలియకున్నా నీళ్లలో దిగినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే.. సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ముక్కు, కళ్లు, చెవిలోకి నీళ్లు పోకుండా జాగ్రత్త పడాలి. ఎక్కువసేపు వెంట్రుకలు తడవకుండా చూసుకోవాలి. లేదంటే.. నీళ్లలో ఉండే బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకే స్లోవిక్ స్టోర్ వాళ్లు ఒక స్విమ్మింగ్ కిట్‌ని అందుబాటులోకి తెచ్చారు. ఈ కిట్‌లో -స్విమ్మింగ్ గాగుల్స్, క్యాప్, ఇయర్ ప్లగ్స్, నోస్ క్లిప్ ఉంటాయి. గాగుల్స్కి ఫాగ్ పట్టినా ఈ స్విమ్మింగ్ గాగుల్స్ నుంచి బాగా కనిపిస్తుంది. స్విమ్మింగ్ క్యాప్ పెట్టుకుంటే పూల్‌లో కెమికల్స్ బారిన పడకుండా ఉండొచ్చు. ముఖ్యంగా క్లోరిన్ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు. జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉన్నా ఇది సరిపోతుంది. దీన్ని పూర్తిగా సిలికాన్‌తో తయారు చేశారు.
ధర : 999 రూపాయలు
స్విమ్ ట్రైనర్
ఈత నేర్చుకోవడమంటే మామూలు విషయం కాదు. చాలా మెళకువలు అవసరం. మరి ఆ మెళకువలన్నీ నేర్చుకునేవరకు నీళ్లలో ఎలా ఈదాలి అంటారా? అలాంటి వాళ్ల కోసమే ఈ ఫ్లోట్ స్విమ్ ట్రైనర్. దీన్ని నడుముకి కట్టుకుంటే.. నీళ్లలో పైకి తేలుతారు. ముఖ్యంగా పిల్లలకు ఇది బాగా పనికొస్తుంది. ట్యూబ్స్, ప్లాస్టిక్ డబ్బాలు కట్టుకునే బదులు ఇలాంటివి కట్టుకోవడం బెటర్. ఇది 4 అడ్జస్టబుల్ లేయర్స్‌తో వస్తుంది. స్విమ్మర్ బరువుని బట్టి వీటిని అడ్జెస్ట్ చేసుకోవాలి. లేయర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. తగ్గించుకోవచ్చు.- స్విమ్ బెల్ట్ ఫంక్షనల్ బకెల్ డిజైన్‌తో వస్తుంది. దీన్ని కూడా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. హై క్వాలిటీ ఈవీఏ మెటీరియల్‌తో దీన్ని తయారుచేశారు. ఇది స్కిన్ ఫ్రెండ్లీ. ఇలాంటి వాటిని చాలా కంపెనీలు మార్కెట్‌లోకి తెచ్చాయి. క్వాలిటీని బట్టి ధర ఉంటుంది.
ధర : 333 రూపాయలు
స్విమ్మింగ్ కిక్ బోర్డ్
ఈత రానివాళ్లు కాసేపు నీళ్లలో గడపడానికి ఇలాంటి కిక్ బోర్డ్‌లు వాడొచ్చు. బోల్డ్‌ఫిట్ అనే కంపెనీ తెచ్చిన ఈ బోర్డ్‌ని ప్రీమియం ఈవీఏ కంప్రెస్డ్ ఫోమ్‌తో తయారుచేశారు. ఇది ‘U’ ఆకారంలో ఉంటుంది. దీన్ని చేతులతో పట్టుకుని కాళ్లతో ఈదడం(కిక్కింగ్ టెక్నిక్స్) నేర్చుకోవచ్చు. అన్ని వయసుల వాళ్లకు సెట్ అవుతుంది. ఇది ఆరు ఎర్గోనమిక్ గ్రిప్ హ్యాండిల్ కటౌట్స్‌తో వస్తుంది. మూడు లేయర్స్ ఉంటాయి.
ధర : 599 రూపాయలు
వాటర్ బెడ్
ఈత కొట్టి అలసిపోయి నీళ్లలోనే కాసేపు సేద తీరాలి అనుకునేవాళ్లకు వాటర్ బెడ్ బెస్ట్ ఛాయిస్. హెచ్‌కేవీ అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ బెడ్ నీళ్లలో ఉయ్యాలలా తేలుతుంది. దీనిమీద పడుకుంటే.. ఉయ్యాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సాఫ్ట్‌గా, సౌకర్యవంతంగా ఉండే దీన్ని హై క్వాలిటీ పీవీసీ మెటీరియల్‌తో తయారు చేశారు. 120కిలోల బరువు వరకు మోస్తుంది. ప్యాకేజీలో ఇన్‌ఫ్లేటర్ పంప్ కూడా వస్తుంది.
ధర : 449 రూపాయలు