టూల్స్ గాడ్జెట్స్ : మసాజర్‌‌‌‌

కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుని పనులు చేసేవాళ్లకు మెడ, భుజం భాగంలో నొప్పి వస్తుంటుంది. అలాంటప్పుడు ఎవరైనా మసాజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ.. మరో మనిషితో పనిలేకుండా ఈ గాడ్జెట్‌‌ చక్కగా మసాజ్ చేసేస్తుంది. దీన్ని లైఫ్‌‌లాంగ్ అనే కంపెనీ మార్కెట్​లోకి తెచ్చింది. మెడ, భుజం భాగంలోని ఎనిమిది కండరాలను చాలా ఎఫెక్టివ్‌‌గా మసాజ్‌‌ చేస్తుంది.

సెట్టింగ్స్‌‌ని అడ్జెస్ట్ చేసుకుని మసాజ్‌‌ లెవల్‌‌ని పెంచొచ్చు. తగ్గించొచ్చు. దీంతో మసాజ్‌‌ చేసుకున్నాక చాలా రిలాక్సింగ్‌‌గా అనిపిస్తుంది. ఇందులో ఇన్‌‌బిల్ట్ టైమర్‌‌ ఉంటుంది. ఆన్ చేసిన పావుగంటకు ఆటోమెటిక్‌‌గా ఆగిపోతుంది. ఇందులోని హీట్ ఫంక్షన్ కండరాలకు వెచ్చదనం ఇస్తుంది. నొప్పి, ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. 
ధర : 2, 299 రూపాయలు

ట్యాపో

హాస్టల్స్‌‌, బ్యాచిలర్‌‌‌‌ రూమ్స్‌‌లో ఉండేవాళ్లు తమ వస్తువులను ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా ఎవరో ఒకరు తీసి వాడుతుటారు. అలా ఎవరంటే వాళ్లు వస్తువులను వాడటం ఇష్టపడని వాళ్లు కప్‌‌బోర్డ్‌‌కి ఈ ట్యాపో గాడ్జెట్‌‌ని పెట్టుకోవాలి. ఇది ఇంటి మెయిన్​డోర్‌‌‌‌కి సేఫ్టీ అలారంలా కూడా పనిచేస్తుంది. ఈ ప్యాక్‌‌లో రెండు గాడ్జెట్స్ ఉంటాయి. ఒక్కోదాన్ని రెండు డోర్లకు ఇన్‌‌స్టాల్‌‌ చేసుకోవాలి. ఎవరైనా ఆ డోర్‌‌‌‌ తెరిస్తే..  మొబైల్‌‌కి నోటిఫికేఫన్ వస్తుంది. దీన్ని కప్‌‌బోర్డ్‌‌కే కాకుండా కిటికీలు, క్యాబినెట్స్‌‌, ఫ్రిజ్, మెయిల్‌‌బాక్స్.. ఇలా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీని ఇన్​స్టాలేషన్​ చాలా ఈజీ. దీని మరో ప్రత్యేకత.. మొబైల్‌‌ యాప్‌‌లో డోర్ ఎప్పుడు తెరిచారు? ఎంతసేపు తెరిచి ఉంచారు? ఎన్నిసార్లు తెరిచారు? అన్ని వివరాలు కనిపిస్తాయి. 
ధర : 999 రూపాయలు 

మల్టీ కుక్ కెటిల్‌‌

మామూలు ఎలక్ట్రిక్‌‌ కెటిల్‌‌తో నీళ్లు వేడి చేసే పని ఒక్కటే జరుగుతుంది. కానీ.. అగారో కంపెనీ తీసుకొచ్చిన మల్టీ పర్పస్‌‌ కుక్‌‌ కెటిల్‌‌ ఉంటే చాలా పనులు చేసుకోవచ్చు. నీళ్లను వేడి చేయడంతోపాటు టీ, కాఫీ పెట్టుకోవచ్చు. గుడ్లు, నూడుల్స్, కూరగాయలను ఆవిరికి ఉడికించొచ్చు. 1.2 లీటర్ల ఇన్నర్ పాట్ కెపాసిటీ, 0.92లీటర్ల స్టీమర్ కెపాసిటీతో డబుల్ లేయర్డ్ బాడీతో వస్తుంది. 600 వాట్స్ పవర్ తీసుకుంటుంది. కార్డ్ ఫ్రీ సర్వింగ్ కోసం 360 డిగ్రీల  స్వివెల్ డిటాచబుల్ పవర్ బేస్ ఉంటుంది. ఒక గాజు మూత వస్తుంది. ఈ కెటిల్​లో పెట్టినవి ఉడకగానే లేదా నీళ్లు మరగగానే ఆటోమెటిక్‌‌గా ఆగిపోతుంది.  ఈ మల్టీ పర్సస్​ కుక్​ కెటిల్​తో కలిపి స్టెయిన్‌‌లెస్ స్టీల్ స్టీమింగ్ పాట్, స్టెయిన్‌‌లెస్ స్టీల్ గ్రిల్ ర్యాక్, గుడ్లు ఉడికించే ర్యాక్, ప్లాస్టిక్ బౌల్‌‌ వస్తాయి.
ధర : 1,699 రూపాయలు 

మినీ బ్లూటూత్ థర్మల్ ప్రింటర్

పిల్లల ప్రాజెక్ట్‌‌ వర్క్‌‌ కోసం, ఇంట్లో పార్టీలప్పుడు డెకరేషన్‌‌ కోసం కొన్ని ప్రింట్స్‌‌ తీసుకోవాల్సి వస్తుంది. అలా ప్రింట్ అవసరమైన ప్రతిసారి బయట షాప్‌‌కి పరిగెత్తాలి. ఈ మినీ ప్రింటర్ ఇంట్లో ఉంటే ఆ అవసరం రాదు. దీన్ని మొరోవిక్ అనే కంపెనీ మార్కెట్​లోకి తీసుకొచ్చింది. ఈ ఇంక్‌‌ ఫ్రీ థర్మల్ ప్రింటర్ బ్లూటూత్‌‌తో పనిచేస్తుంది. దీన్ని మొబైల్‌‌ యాప్‌‌తో ఆపరేట్‌‌ చేయొచ్చు.

లేబుల్స్‌‌, స్టిక్కర్, చిన్న ఫొటోలు దీంతో ప్రింట్‌‌ తీయొచ్చు. ప్యాక్‌‌లోనే 57x25 ఎంఎం సైజు ఉండే 5 ప్రింట్ పేపర్ రోల్, 5 సెల్ఫ్‌‌ అడెన్సివ్‌‌, స్టిక్కర్‌‌ల సెట్‌‌ వస్తుంది. థర్మల్ ప్రింట్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇందులో ఇంక్ నింపాల్సిన పనిలేదు. 200 డీపీఐ రెజల్యూషన్‌‌తో ప్రింట్‌‌ చేస్తుంది. చాలా చిన్న సైజులో ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. యూఎస్‌‌బీ ఛార్జింగ్‌‌ సపోర్ట్‌‌తో వస్తుంది.1200mAh బ్యాటరీ ఉంటుంది. పవర్‌‌బ్యాంక్ లేదా అడాప్టర్​కి కనెక్ట్ చేసి ఛార్జింగ్‌‌ పెట్టుకోవచ్చు.
ధర : 1,899 రూపాయలు