టూల్స్ గాడ్జెట్స్.. కార్‌‌ బెడ్‌

కార్‌‌ బెడ్‌

కారులో లాంగ్‌ టూర్లకు వెళ్లినప్పుడు కాసేపు నడుం వాలిస్తే బాగుండు అనిపిస్తుంది. అలా లాంగ్​ జర్నీలో కూడా రెస్ట్‌ తీసుకునేందుకు కొన్ని కంపెనీలు కార్ ఎయిర్ మ్యాట్రెస్‌ని తయారచేశాయి. వీటిని వెనుక సీటుపై పెట్టుకుంటే ఈజీగా ఇద్దరు పడుకోవచ్చు. ఈ మ్యాట్రెస్‌ని పీవీసీ మెటీరియల్‌తో తయారు చేశారు. సున్నితంగా, సౌకర్యవంతంగా ఉంటాయి. మన్నికైనవి కూడా. అంతేకాదు.. ఇవి నాన్-టాక్సిక్, టేస్ట్​లెస్, యాంటీ–సీస్మిక్, ప్రెజర్ ప్రూఫ్‌తో వస్తాయి. మ్యాట్రెస్‌ నుంచి గాలి తీసేస్తే చిన్న సైజులోకి మారిపోతుంది. దీన్ని వెంట తీసుకెళ్లడం, ఉపయోగించడం చాలా సులభం. ఎలక్ట్రిక్ పంప్‌ను కార్ లైటర్ సాకెట్‌కు కనెక్ట్ చేస్తే.. నిమిషాల్లో గాలి నిండిపోతుంది. ఇది 300 కేజీల బరువు మోయగలదు. కార్, ఎస్‌యూవీ, మినీ వ్యాన్‌.. అన్నింటికి సరిపోతుంది. 

ధర : క్వాలిటీని బట్టి 1,779 రూపాయలతో మొదలు

మల్టీ టూల్‌

ట్రెక్కింగ్, క్యాంపింగ్‌, హైకింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడ టెంట్‌ వేసుకోవడానికి, స్టవ్‌ సెట్‌ చేసుకోవడానికి రకరకాల టూల్స్‌ అవసరం పడతాయి. అందుకే చాలామంది టూల్‌కిట్‌ పట్టుకెళ్తుంటారు. కానీ.. ఈ మల్టీటూల్ ఉంటే వేరే టూల్‌కిట్లతో పనేలేదు. ఎమ్​టిరాయల్డియా అనే కంపెనీ తెచ్చిన ఈ టూల్‌లో 24 ఫీచర్లు ఉన్నాయి. ఎలక్ట్రికల్​ వైర్ కట్టర్, స్ట్రిప్పర్ ఫోల్డింగ్ నైఫ్, క్యాన్, బాటిల్ ఓపెనర్, మెటల్ ఫైల్ స్క్రూ డ్రైవర్లు, పదకొండు రకాల స్క్రూ డ్రైవర్ బిట్లు... ఇలా 24 టూల్స్‌ ఈ ఒక్క టూల్​లోనే ఉన్నాయి. క్యాంపింగ్, హైకింగ్, బ్యాక్‌ప్యాకింగ్, ఫిషింగ్‌... ఇలా ఎక్కడికెళ్లినా ఇది బాగా ఉపయోగపడుతుంది. కారు, బైక్ రిపేర్ టూల్స్ కూడా ఉన్నాయి ఇందులో. దీన్ని హై క్వాలిటీ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారుచేశారు.  కాంపాక్ట్ సైజులో ఉంటుంది. జేబులో లేదా బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకుని తీసుకెళ్లొచ్చు. 

ధర: 699 రూపాయలు 

కట్లెరీ సెట్‌ 

చాలామందికి ఇతరులు వాడిన స్పూన్‌‌, ఫోర్క్​తో ఫుడ్‌‌ తినడం ఇష్టం ఉండదు. వాళ్లు హోటల్స్​కి వెళ్లినప్పడు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటివాళ్లు ఈ మల్టీ కట్లెరీ సెట్‌‌ని వెంట తీసుకెళ్తే సరి. ముఖ్యంగా హైకింగ్‌‌, క్యాంపింగ్‌‌లకు వెళ్లినప్పుడు పనికొచ్చే టూల్స్‌‌ కూడా ఇందులో ఉన్నాయి. దీన్ని స్టెయిన్‌‌లెస్ స్టీల్, అల్యూమినియం మెటీరియల్‌‌తో తయారుచేశారు. అంత ఈజీగా తుప్పు పట్టదు. చిన్న సైజులో ఉంటుంది. కాబట్టి ఎక్కడికైనా ఈజీగా పట్టుకెళ్లొచ్చు.  ఇందులో ఫోర్క్, స్పూన్, నైఫ్ సెట్, బాటిల్‌‌ ఓపెనర్‌‌‌‌ ఉంటాయి. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి బరువు ఉంటుంది అనుకునేరు. బరువు కూడా తక్కువే. 

ధర : 315 రూపాయలు 

లగేజ్‌ ట్యాగ్‌

గ్రూప్‌‌‌‌గా టూర్లకు వెళ్లినప్పుడు బ్యాగులు మారడం చాలా కామన్‌‌‌‌. ముఖ్యంగా ఇంటర్నేషనల్‌‌‌‌ ట్రిప్స్‌‌‌‌, లాంగ్‌‌‌‌ ట్రిప్స్​కు వెళ్లినప్పుడు ఇలాంటి సమస్య వస్తుంటుంది. అలాంటప్పుడు ఇలాంటి ట్యాగ్స్​ని బ్యాగుకి తగిలిస్తే సరిపోతుంది. వీటిమీద పేరు, అడ్రస్‌‌‌‌ రాయొచ్చు. ఒకవేళ బ్యాగు ఎక్కడైనా పోగొట్టున్నా దొరికినవాళ్లు మనకు చేర్చడానికి కూడా ఈ ట్యాగ్స్​లు యూజ్ అవుతాయి. దీన్ని హై క్వాలిటీ ప్రీమియం పీవీసీతో తయారు చేశారు. ముఖ్యంగా పిల్లలు స్కూల్‌‌‌‌కు లేదంటే విదేశాలకి వెళ్లేటప్పుడు.. సూట్‌‌‌‌కేస్, హ్యాండ్‌‌‌‌బ్యాగ్, ల్యాప్‌‌‌‌టాప్ బ్యాగ్, స్కూల్ బ్యాగ్, బ్యాక్‌‌‌‌ప్యాక్, గోల్ఫ్ బ్యాగ్, స్పోర్ట్స్ బ్యాగ్, బ్రీఫ్‌‌‌‌కేస్, లగేజ్ బ్యాగ్‌‌‌‌కి వీటిని తగిలిస్తే.. కనిపెట్టడం ఈజీ అవుతుంది. 

ధర : 188 రూపాయలకు 6 ట్యాగ్‌‌‌‌లు