టూల్స్ గాడ్జెట్స్ : పిల్లల సేఫ్టీ కోసం

పసి పిల్లలు నడవడం మొదలుపెడితే.. వాళ్లను ఆపడం చాలా కష్టం. ఇల్లంతా చుట్టేస్తారు. ఇలాంటి టైంలో పదునైన వస్తువులు వాళ్లకు దొరక్కుండా జాగ్రత్తపడుతుంటారు తల్లిదండ్రులు. అయినా.. ఎక్కడో ఒక చోట దెబ్బ తగిలించుకుంటూనే ఉంటారు. అలాంటి చిచ్చర పిడుగుల కోసం కొన్ని సేఫ్టీ టూల్స్‌‌. ఇవి వాడితే.. పిల్లలు ప్రమాదాల బారిన పడకుండా ఉంటారు. అవేంటంటే..

టేబుల్​ ప్రొటెక్టర్‌‌‌‌ 

టేబుల్ మీదున్న వస్తువులను తీసుకోవడానికి తెగ ప్రయత్నిస్తారు పిల్లలు. అవి చేతులకు అందకపోతే.. కాలి వేళ్ల మీద నిలబడి మరీ ట్రై చేస్తుంటారు. అలాంటప్పుడు జారి పడితే..  టేబుల్‌‌ అంచులు తగిలే ప్రమాదం ఉంది. అందుకే టేబుల్‌‌ కార్నర్లు, ఎడ్జ్‌‌లకు ప్రొటెక్టర్లు పెట్టాలి. సిగ అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ ఎడ్జ్‌‌ సేఫ్టీ స్ట్రిప్‌‌ని టేబుల్, కుర్చీల మూలలకు పెట్టుకోవచ్చు. దీన్ని ప్రీమియం పీవీసీతో తయారుచేశారు. ఇవి షాక్‌‌అబ్జార్బర్​గా పనిచేస్తాయి. పిల్లలు వీటిని కొరికినా, లాగినా ఊడిపోవు. వీటిని మెత్తని మెటీరియల్‌‌తో తయారుచేయడం వల్ల పిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ధర: 197 రూపాయలకు రెండు మీటర్లు 

చైల్డ్‌‌ సేఫ్టీ లాక్స్‌‌ 

చిన్న సందు కనిపిస్తే చాలు దాంట్లో వేలు పెట్టి చూస్తారు పిల్లలు. ముఖ్యంగా డోర్‌‌‌‌ టేబుల్‌‌ డ్రాయర్‌‌‌‌లో వేళ్లు పెట్టడం ఎక్కువ. అలాంటివాళ్లకు ఇది బెస్ట్ సేఫ్టీ లాక్‌‌. చెక్క బీరువా, టేబుల్‌‌ డ్రాయర్‌‌‌‌, కప్​బోర్డ్‌‌ డోర్స్, టాయిలెట్‌‌ సీట్‌‌, రిఫ్రిజిరేటర్‌‌‌‌ డోర్‌‌‌‌.. ఇలాంటి వాటిని తెరిచిన ప్రతిసారి తాళం వేయాలంటే కుదరదు. అందుకే ఈ సేఫ్టీ లాక్ వాడాలి. దీన్ని కిడ్‌‌డౌగ్‌‌ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఈ లాక్స్​ను ఏ డోర్‌‌‌‌కైనా ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. స్టిక్‌‌ చేయడానికి 3ఎం. టేపు ఉంటుంది. వీటిని నిమిషంలో ఇన్‌‌స్టాల్‌‌ చేయొచ్చు. డోర్ మూసిన వెంటనే లాక్‌‌ చేసుకుంటే.. పిల్లలు తీయలేరు. వీటిని ఏబీఎస్‌‌ ప్లాస్టిక్‌‌తో తయారు చేశారు. ఇవి బలమైనవి, మన్నికైనవి. వీటికి నైలాన్ స్ట్రాప్ ఉంటుంది. 

ధర: 359 రూపాయలకు 10 లాక్‌‌లు

సాకెట్‌‌ కవర్‌‌‌‌ 

ఇంట్లో ఎక్కడ ఎలక్ట్రిక్‌‌ సాకెట్లు కనిపించినా వాటిలో వేళ్లు పెడుతుంటారు పిల్లలు. అందుకే చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో వీలైనంత వరకు అన్ని సాకెట్లను ఈ ప్రొటోవేర్‌‌‌‌ బేబీ ప్రొటెక్టర్‌‌‌‌తో కవర్‌‌‌‌ చేయాలి. వీటిని ప్రొటోవేర్‌‌‌‌ అనే కంపెనీ తయారుచేసింది. హై క్వాలిటీ ఏబీఎస్‌‌ ప్లాస్టిక్‌‌తో తయారుచేశారు. ఇవి సాకెట్‌‌ హోల్స్‌‌ని పూర్తిగా మూసేస్తాయి. పిల్లలు ఊడదీయడానికి ప్రయత్నించినా అంత ఈజీగా బయటికి రావు. ప్యాకేజీలో 10  ప్రొటెక్టర్లు 5 ఆంపియర్ సాకెట్​కు సరిపోయేవి, రెండు15 ఆంపియర్ సాకెట్ ప్రొటెక్టర్లు వస్తాయి. 

ధర : 159 రూపాయలు 

హెల్మెట్‌‌

కొందరు పిల్లలు క్షణం కూడా ఒకచోట ఉండరు. ఎప్పుడూ పరిగెత్తుతూనే ఉంటారు. కిందపడి దెబ్బలు తగిలించుకుంటారు. అలాంటి పిల్లలకు దెబ్బలు తగలకుండా కాపాడుకోవాలంటే.. ఈ సేఫ్టీ హెల్మెట్‌‌, నీ ప్యాడ్స్‌‌ వేయాలి. ఇవి వంద శాతం కాటన్‌‌తో చేసినవి. కింద పడ్డప్పుడు తల, మోకాళ్లకు దెబ్బలు తగలకుండా కాపాడతాయి. 43 సెం.మీ. నుండి 56 సెం.మీ. తల చుట్టుకొలతతో అడ్జెస్ట్‌‌ చేసుకోవచ్చు. 6 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకు ఇది సరిపోతుంది. హెల్మెట్‌‌,  నీ ప్యాడ్స్‌‌ చాలా సాఫ్ట్‌‌గా ఉంటాయి. అల్ట్రా లైట్ వెయిట్ (65గ్రా)తో వస్తుంది. షాక్ అబ్సార్బ్ కెపాసిటీ కూడా ఉంది. దీన్ని లిల్టోయెస్‌‌ అనే కంపెనీ మార్కెట్‌‌లోకి తీసుకొచ్చింది.         

ధర : 469 రూపాయలు