ఫాసెట్ ఎరేటర్
ఇప్పుడంటే రకరకాల ఫాసెట్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ.. కొన్నేండ్ల క్రితం కట్టిన ఇండ్లలో ఇప్పటికీ సింక్‌లో పాత నల్లాలే ఉన్నాయి. వాటిని కూడా లేటెస్ట్ ఫాసెట్లలా మార్చుకోవచ్చు. అందుకోసం వాటర్‌నైంప్ కంపెనీ తెచ్చిన ఈ ఫాసెట్ ఎరేటర్‌ని నల్లాకు బిగించాలి. పాత ఫాసెట్‌కి మేల్ థ్రెడ్ ఉంటే దీనికి ఉండే ఫిమేల్ థ్రెడ్‌తో నేరుగా బిగించుకోవచ్చు. లేదంటే ఎడాప్టర్ వాడాలి. ఈ ఎరేటర్ నుంచి సాఫ్ట్ బబుల్ స్ట్రీమ్ 1.8 జీపీఎంతో నీళ్లు వస్తాయి. అంటే ఇది బలమైన స్ప్రేయర్ షవర్‌లా పనిచేస్తుంది. దీన్ని 720 డిగ్రీల వరకు ఎటువైపయినా తిప్పొచ్చు.
360 డిగ్రీల స్వివెల్ యాంగిల్, 270 ట్విస్ట్ అండ్ రొటేట్ యాంగిల్‌లో వాడుకోవచ్చు. ఎరేటర్‌ని హై క్వాలిటీ ఇత్తడితో తయారుచేశారు. ఇది కిచెన్ సింక్‌కి బెస్ట్ చాయిస్. సింక్‌లోని ప్రతి మూలకు నీరు చేరుతుంది. పాత్రలు కడగడం, చేతులు కడుక్కోవడం చాలా ఈజీ. దీన్ని రెండు రకాలుగా వాడొచ్చు. ఈ ఫాసెట్‌కి ఉండే నాజిల్‌ని ఒకవైపు తిప్పితే ఎరేటర్ మధ్యలో నుంచి సాఫ్ట్ బబుల్స్‌తో వాటర్ వస్తుంది. మరోవైపుకి తిప్పితే ఎరేటర్ రిమ్ నుంచి వాటర్ స్ప్రే అవుతుంది. అంతేకాదు.. దీన్ని పై వైపుకి తిప్పి.. ముఖాన్ని డైరెక్ట్‌గా ఫాసెట్‌తోనే కడుక్కోవచ్చు.
ధర : 210 రూపాయలు
డ్రెయిన్ బాస్కెట్
చాలామంది అన్నం తిని ప్లేట్లను డైరెక్ట్‌గా సింక్‌లో వేస్తుంటారు. పైగా కూరగాయలు కట్ చేసినప్పుడు వచ్చే వేస్ట్‌లో కొంత సింక్‌లో చేరుతుంది. అదంతా నీళ్లు వెళ్లే జాలీకి అడ్డుపడి సింక్ నీళ్లతో నిండిపోతుంది. అలాకాకుండా ఉండాలంటే ఇలాంటి సింక్ డ్రెయిన్ బాస్కెట్ వాడాలి. దీన్ని హ్రోయ్ అనే కంపెనీ తయారుచేసింది. దీన్ని సింక్‌లోనే ఒక మూలన పెట్టుకోవాలి. అన్నం తిన్న ప్లేట్స్, కూరగాయలు కడిగిన నీళ్లు ఈ బాస్కెట్‌లో పోస్తే..
అందులో ఉండే వేస్ట్ అంతా బాస్కెట్‌లో పడుతుంది. దీని కిందిభాగంలో ఉన్న రంధ్రాల ద్వారా నీళ్లు సింక్‌లో పడతాయి. దీన్ని ఇన్‌స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ. ఇన్‌స్టాల్ చేసుకోవడానికి కావాల్సిన స్టిక్ కూడా ప్యాక్‌తోనే వస్తుంది. ఈ బాస్కెట్‌ను చాలా తేలికైన, మన్నికైన ప్లాస్టిక్‌తో తయారు చేశారు. అవసరమైనప్పుడు ఈజీగా తీసి, క్లీన్ చేసుకోవచ్చు.
ధర : 149 రూపాయలు
డిష్ డ్రైనర్
కడిగిన గిన్నెలను ఆరబెట్టకుండానే షెల్ఫ్‌ల్లో సర్దితే వాటి నుంచి జారిన నీటి బొట్లతో షెల్ఫ్ అంతా తడిసిపోతుంది. అందుకే గిన్నెలు కడిగిన వెంటనే ఆరబెట్టాలి. అందుకోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఈ డ్రెయినర్ ర్యాక్‌ని వాడితే సరిపోతుంది. ఇది గిన్నెలు ఆరబెట్టడానికే ప్రత్యేకంగా తయారుచేసిన డ్రెయినర్. దీని ర్యాక్‌లో వేసిన గిన్నెల నుంచి కారిన నీటి బొట్లు కింద ఉన్న ట్రేలోకి వెళ్తాయి.
దీన్ని సింక్ పక్కనే పెడతాం కాబ్టటి నీళ్లు ట్రే నుంచి నేరుగా సింక్‌లోకి వెళ్తాయి. స్మార్ట్‌స్లైడ్ కంపెనీ తెచ్చిన ఈ రాక్‌లో చాప్‌స్టిక్‌లు, స్పూన్లు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. ఇందులో గిన్నెలే కాదు.. పండ్లు, కూరగాయలను కూడా డ్రెయిన్ చేసుకోవచ్చు.
ధర : 999 రూపాయలు
ఆటోమేటిక్ ఫాసెట్
పిల్లలు చాలాసార్లు ట్యాప్ ఆఫ్ చేయడం మర్చిపోతుంటారు. అలాంటప్పుడు సింక్‌లో నల్లాకు అడ్వాన్స్‌డ్ ఆటోమేటిక్ సెన్సర్ ఫాసెట్‌ని బిగిస్తే ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఇందులో ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ ఉంటుంది. దానివల్ల ఫాసెట్ కింద చేయి పెట్టినప్పుడే నీళ్లు వస్తాయి. చేయి తీసిన వెంటనే నీళ్లు ఆగిపోతాయి. దీనివల్ల నీళ్లు ఆదా అవుతాయి. ఈ ఫాసెట్ 20–30 ఎం.ఎం. నల్లాలకు సరిపోతుంది. మౌంట్యాక్సెసరీ, ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ ప్యాకేజీలోనే వస్తాయి.
కాబట్టి ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న సెన్సర్ పనిచేయడానికి నాలుగు AA ఆల్కలైన్ బ్యాటరీలు కావాలి. నీళ్లు తక్కువగా వాడే చిన్న కుటుంబమైతే బ్యాటరీలను రెండేండ్ల వరకుమార్చాల్సిన పనిలేదు. బ్యాటరీలను కంట్రోల్ బాక్స్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. దీన్ని గట్టి ఇత్తడి బ్రష్ ఫినిషింగ్‌తో తయారు చేశారు.
ధర : 2,999 రూపాయలు