టూల్స్ గాడ్జెట్స్..ఎమర్జెన్సీ  పంక్చర్ కిట్

ఎమర్జెన్సీ  పంక్చర్ కిట్

ఎండాకాలంలో మండే ఎండల వల్ల జనాలే కాదు.. వెహికల్స్​కు కూడా ఇబ్బందే. ముఖ్యంగా టైర్లు పదే పదే పంక్చర్ అవుతుంటాయి. పంక్చర్ అయినప్పుడు పంక్చర్​ షాపు కనుచూపు మేరలో ఉంటే పర్లేదు. అలాకాకుండా జనాలు లేని చోట పంక్చర్ అయితేనే ఇబ్బంది. అందుకే వెహికల్​లో ఎమర్జెన్సీ పంక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిట్ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చే వెహికల్స్​లో ట్యూబ్‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌‌‌‌‌ టైర్లే ఉంటున్నాయి. కాబట్టి పంక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయడం కూడా చాలా ఈజీ. జెనరిక్ అనే కంపెనీ తెచ్చిన కిట్‌‌‌‌‌‌‌‌లో ట్యూబ్‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌‌‌‌‌ టైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వేసేందుకు కావాల్సినవన్నీ ఉన్నాయి. ఈ సెట్‌‌‌‌‌‌‌‌లో 5 బ్రౌన్ స్ట్రింగ్స్​ ఉంటాయి. అవి ఐదు పంక్చర్​లకు  సరిపోతాయి. టైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లగ్‌‌‌‌‌‌‌‌ కిట్‌‌‌‌‌‌‌‌లో రబ్బర్–గ్రిప్ డ్యూరబుల్ ‘టీ’ -హ్యాండిల్‌‌‌‌‌‌‌‌ ప్రోబ్, రీమర్ ఉంటాయి. వీటితో నిమిషాల్లో పంక్చర్‌‌‌‌‌‌‌‌ రిపేర్ చేయొచ్చు. వీటితోపాటు గుచ్చిన మేకులను తీయడానికి ఒక చిన్న కటింగ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్లూ ట్యూబ్‌‌‌‌‌‌‌‌ ఉంటాయి. ఈ కిట్‌‌‌‌‌‌‌‌తో బైక్‌‌‌‌‌‌‌‌, కార్​, ట్రాక్టర్​, లాన్ మూవర్స్, డర్ట్ బైక్స్​, ట్రైలర్‌‌‌‌‌‌‌‌, జీప్‌‌‌‌‌‌‌‌, ట్రక్​.. ఇలా ఏ వెహికల్​కి అయినా పంక్చర్‌‌‌‌‌‌‌‌ బాగు చేయొచ్చు.  

ధర : 225 రూపాయలు 

చైన్‌‌‌‌‌‌‌‌ క్లీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

ఈ కాలంలో బైక్‌‌‌‌‌‌‌‌ లేని ఇల్లు ఉండట్లేదు. దాదాపు ప్రతి ఒక్కరికీ సొంత బైక్ ఉంటోంది. కానీ.. వాటిని సరిగ్గా మెయింటెయిన్‌‌‌‌‌‌‌‌ చేయకపోవడంతో బైక్​ సర్వీసింగ్‌‌‌‌‌‌‌‌కి ఇచ్చినప్పుడు బిల్లు భారీగా కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే.. అప్పుడే రిపేర్లన్నీ బయటపడుతుంటాయి. ముఖ్యంగా ఓపెన్ చెయిన్‌‌‌‌‌‌‌‌ కవర్ ఉండే బైక్‌‌‌‌‌‌‌‌ల్లో చెయిన్‌‌‌‌‌‌‌‌ త్వరగా పాడైపోతుంటుంది. అందుకే రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇంట్లోనే చైన్‌‌‌‌‌‌‌‌ ల్యూబ్‌‌‌‌‌‌‌‌ చేస్తుండాలి. అందుకోసం ‘బ్లాక్‌‌‌‌‌‌‌‌బర్డ్‌‌‌‌‌‌‌‌’ కంపెనీ చెయిన్‌‌‌‌‌‌‌‌ క్లీనింగ్‌‌‌‌‌‌‌‌ కిట్‌‌‌‌‌‌‌‌ బాగా ఉపయోగపడుతుంది. ఈ కిట్​​లో ఒక క్లీనింగ్‌‌‌‌‌‌‌‌ స్ప్రే, బ్రష్‌‌‌‌‌‌‌‌తోపాటు ల్యూబ్‌‌‌‌‌‌‌‌ చేయడానికి మరో స్ప్రే ఉంటుంది. ముందుగా క్లీనింగ్‌‌‌‌‌‌‌‌ స్ర్పేను చెయిన్‌‌‌‌‌‌‌‌ మీద స్ప్రే చేసి, బ్రష్‌‌‌‌‌‌‌‌తో శుభ్రంగా తుడవాలి. ఆ తర్వాత ల్యూబ్‌‌‌‌‌‌‌‌ స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల చెయిన్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌టైం పెరుగుతుంది. 

ధర : 488 రూపాయలు 

యాంటీ- పంక్చర్ సీలెంట్

పంక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాక బాధపడడం కంటే కూడా అది కాకముందే జాగ్రత్త పడడం బెటర్​. ఎలాగంటే.. ప్రస్తుతం మార్కెట్‌‌‌‌‌‌‌‌లో చాలా కంపెనీలు టైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీలెంట్‌‌‌‌‌‌‌‌ లిక్విడ్స్‌‌‌‌‌‌‌‌ని తెచ్చాయి. వాటిని వాడితే.. పంక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినా కూడా.. చాలాసేపు వెహికల్​ నడపొచ్చు. ఈ లిక్విడ్‌‌‌‌‌‌‌‌ని బైక్‌‌‌‌‌‌‌‌ టైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్తే.. పంక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన వెంటనే గాలి బయటికి రాదు. గాలి పూర్తిగా పోయేందుకు చాలా టైం పడుతుంది. కొన్ని కంపెనీల లిక్విడ్స్‌‌‌‌‌‌‌‌ పోస్తే నాలుగైదు రోజుల వరకు గాలి కొంచెం కూడా బయటికి రాదు. గాలి పోయే లోపు సొంతంగా లేదా షాప్‌‌‌‌‌‌‌‌కి తీసుకెళ్లి పంక్చర్​ వేయించుకోవచ్చు.ఈ లిక్విడ్స్‌‌‌‌‌‌‌‌ని బైక్, స్కూటీ, కార్ టైర్‌‌‌‌‌‌‌‌లో వాడొచ్చు. ఇది ట్యూబ్‌‌‌‌‌‌‌‌ లెస్‌‌‌‌‌‌‌‌ టైర్లలో అయితేనే బాగా పనిచేస్తుంది. 

ధర: 300 రూపాయల నుంచి మొదలు 

ఎయిర్ పంప్ 

ఎండాకాలంలో వెహికల్స్​ టైర్లలో ఎప్పుడు గాలి తగ్గుతుందో తెలియదు. కాబట్టి పోర్టబుల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంప్‌‌‌‌‌‌‌‌ దగ్గర ఉండాలి. వాచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే కంపెనీ బైక్‌‌‌‌‌‌‌‌, కార్ల టైర్లలో నింపే పోర్టబుల్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంప్‌‌‌‌‌‌‌‌ని మార్కెట్​లోకి తెచ్చింది. దీనికి మూడు అటాచ్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ కూడా వస్తాయి. కార్ల కోసం ష్రాడర్ వాల్వ్, బైక్‌‌‌‌‌‌‌‌ల కోసం ప్రెస్టా వాల్వ్, వాలీబాల్‌‌‌‌‌‌‌‌, వాటర్ ఫూల్ లాంటి వాటికోసం నీడిల్ అడాప్టర్ ఉంటాయి. ఇందులో పీఎస్‌‌‌‌‌‌‌‌ఐని సెట్‌‌‌‌‌‌‌‌ చేసుకుని, వాల్వ్‌‌‌‌‌‌‌‌ని టైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఎటాచ్‌‌‌‌‌‌‌‌ చేసి, ఆన్‌‌‌‌‌‌‌‌ చేయాలి. సెట్‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌ఐకి రీచ్‌‌‌‌‌‌‌‌ కాగానే ఆటోమెటిక్‌‌‌‌‌‌‌‌గా ఆఫ్ అయిపోతుంది. ఇందులో 4000 mAh రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. యూఎస్‌‌‌‌‌‌‌‌బీ కేబుల్‌‌‌‌‌‌‌‌, కార్లలో ఉండే12 వోల్ట్స్‌‌‌‌‌‌‌‌ ఎడాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఛార్జ్‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు. దీనికి ఒక డిజిటల్ డిస్‌‌‌‌‌‌‌‌ప్లే కూడా ఉంటుంది. అందులో పీఎస్‌‌‌‌‌‌‌‌ఐ, బ్యాటరీ పర్సంటేజ్ లాంటివి చూసుకోవచ్చు. చిన్న సైజులో రావడం వల్ల ఎటు వెళ్లినా ఈజీగా పట్టుకెళ్లొచ్చు. దీన్ని పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లా కూడా వాడొచ్చు. రాత్రిళ్లు గాలి నింపేటప్పుడు ఇబ్బంది కలగకుండా దీనికి ఒక ఎల్‌‌‌‌‌‌‌‌ఈడీ లైట్‌‌‌‌‌‌‌‌ కూడా ఉంది. 

ధర : 2,027 రూపాయలు