కాయిన్ టిష్యూ
ట్రావెల్ చేసేటప్పుడు వెళ్లిన చోటల్లా టిష్యూలు దొరకవు. అలాగని ఎక్కువ టిష్యూస్ తీసుకెళ్లాలంటే లగేజీ బ్యాగ్‌లో చాలా స్పేస్ కావాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు కాయిన్ టిష్యూని వెంట తీసుకెళ్తే సరిపోతుంది. మార్కెట్‌లో చాలారకాల కంపెనీలు ఇలాంటి టిష్యూస్ అమ్ముతున్నాయి. కంప్రెషన్ టెక్నిక్‌తో స్పన్‌లేస్ ఫ్యాబ్రిక్‌ని వాడి చిన్న సైజులో టిష్యూ కాయిన్స్ తయారుచేస్తారు. వీటిని నీళ్లలో మూడు సెకన్లు ఉంచితే.. టిష్యూలా మారిపోతాయి. సైజు చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి ఎక్కడికైనా ఈజీగా పట్టుకెళ్లొచ్చు. వీటిలో చాలావరకు వంద శాతం నేచురల్ వెజిటబుల్ ఫైబర్ వాడతారు. ఇది పూర్తిగా బయో డిగ్రేడబుల్.
ధర : 199 రూపాయలకు 50 కాయిన్స్
గో ట్రిప్పిన్
స్కూ ల్స్, కాలేజీలకు సమ్మర్ హాలీడేస్ మొదలైన వెంటనే టూర్లు మొదలవుతాయి. ఆ టూర్‌కి వెళ్లినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేందుకు కొన్ని గాడ్జెట్స్ అవసరం పడతాయి. ముఖ్యంగా ఫారెన్ ట్రిప్ వెళ్లేవాళ్లు ఇంటర్నేషనల్ ట్రావెల్ అడాప్టర్స్ తీసుకెళ్లాలి. ఎందుకంటే చాలా దేశాల్లో మన దగ్గర ఉండే పవర్ సాకెట్స్ ఉండవు. కాబట్టి అడాప్టర్ వాడాల్సిందే. అందుకే గో ట్రిప్పిన్ అనే కంపెనీ ఏ దేశానికి వెళ్లినా వాడేలా ఒక ఎడాప్టర్‌ని తయారుచేసింది. అమెరికా, యూరప్, జపాన్, దుబాయ్, బ్రెజిల్, చైనా, ఐర్లాండ్, ఫ్రాన్స్, కెనడాల్లో వాడే అన్ని డిఫరెంట్ సాకెట్లకు దీన్ని కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. దీనికి రెండు యూఎస్‌బీ పోర్ట్స్ కూడా ఉన్నాయి. వాటినుంచి ఒకేసారి రెండు డివైజ్‌లకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఎడాప్టర్‌కు మరో ఇండియన్ సాకెట్ ప్లగ్‌ని కూడా పెట్టొచ్చు.
ధర : 789 రూపాయలు
వేయింగ్ స్కేల్
ఇంటర్నేషనల్ ట్రావెల్స్ ఎక్కువగా చేసేవాళ్లకు లగేజీ చాలా పెద్ద సమస్య. ఎందుకంటే.. విమానాల్లో లగేజీ వెయిట్ లిమిట్ కొంత మాత్రమే ఉంటుంది. ఆ లిమిట్ దాటితే.. అదనంగా డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఈ వేయింగ్ స్కేల్ ఇంట్లో ఉంటే టూర్‌కి వెళ్లేటప్పుడు లగేజీ బ్యాగ్‌లను ఇంట్లోనే తూకం వేసుకుని, సరిపడా వెయిట్ మాత్రమే తీసుకెళ్లొచ్చు. ఈ వేయింగ్ మిషన్‌ని ‘ఫ్లయింగో’ అనే కంపెనీ తెచ్చింది. దీంతో 50 గ్రాముల నుంచి 50 కేజీల వరకు తూకం వేయొచ్చు. దీనికి ఉండే పట్టీకి బ్యాగుని తగిలిస్తే.. ఎల్‌ఈడీ స్క్రీన్ మీద ఎంత బరువు ఉందో కనిపిస్తుంది. దీని హ్యాండిల్ సామాన్లను తూకం వేసేటప్పుడు కంఫర్ట్ గ్రిప్ ఇస్తుంది. జేబులో పెట్టుకుని దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఎల్‌ఈడీ స్క్రీన్ మీద టెంపరేచర్ కూడా కనిపిస్తుంది. ఆటో షట్ఆఫ్ టెక్నాలజీ వల్ల సామాన్ల బరువు చూసిన కాసేపటికి ఆటోమెటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. దీంతో ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్, బియ్యం బస్తాలను కూడా తూకం వేసుకోవచ్చు.
ధర : 495 రూపాయలు
గాడ్జెట్స్ ఆర్గనైజర్
ఒక గ్రూప్‌గా టూర్‌కు వెళ్తున్నారంటే అందరివీ కలిసి ఫోన్ ఛార్జింగ్ అడాప్టర్లు, కేబుల్స్, ల్యాప్‌టాప్, కెమెరాలకు సంబంధించిన యాక్సెసరీస్ చాలానే ఉంటాయి. అవన్నీ లగేజీ బ్యాగులో పెడితే అవసరమైనప్పుడు వెతుక్కోవడం పెద్ద ప్రహసనం. అలా వెతికే శ్రమ తప్పాలంటే ఎలక్ట్రానిక్ ట్రావెల్ బ్యాగ్ వాడాలి. దీన్ని హౌజ్ ఆఫ్ క్విర్క్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.10 బకెల్స్‌తో ఉంటుంది ఇది. ఇందులో ఉండే ప్యాడెడ్ డివైడర్లు అవసరానికి తగ్గట్టు అడ్జెస్ట్ చేసుకోవచ్చు. లోపల ఉండే ప్యాడ్స్ చాలా మెత్తగా ఉంటాయి. కాబట్టి బ్యాగ్ కింద పడినా లోపలి వస్తువులు పాడుకావు. దీన్ని డ్యుయెల్ లేయర్ వాటర్‌ప్రూఫ్ ఫ్యాబ్రిక్, షాక్‌ప్రూఫ్ మెటీరియల్‌తో తయారుచేశారు.
ధర : 499 రూపాయలు