టూల్స్​ & గాడ్జెట్స్​: డ్యాన్సింగ్​  శాంట

డ్యాన్సింగ్​  శాంట

క్రిస్మస్​ వచ్చిందంటే పిల్లల్లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తుంటుంది. శాంటా క్లాజ్​​ వచ్చి గిఫ్ట్స్​ ఇస్తాడని ఎదురుచూస్తుంటారు. అలాంటి వాళ్లకు శాంటా క్లాజ్​​నే గిఫ్ట్​గా ఇస్తే చాలా సంతోషిస్తారు. పెప్​స్టర్​ అనే కంపెనీ ఈ డ్యాన్సింగ్​ శాంటాని మార్కెట్​లోకి తీసుకొచ్చింది. తలకిందులుగా ఉండే ఈ శాంటా పవర్ బటన్‌ ఆన్​ చేస్తే.. పాట పాడుతూ.. గుండ్రంగా తిరుగుతుంది. దీన్ని పిల్లలకు గిఫ్ట్​గా ఇచ్చేందుకే కాదు.. ఇంట్లో డెకరేషన్​ కోసం కూడా వాడుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ శాంతా క్లాజ్ ప్యానెల్స్​ని​ క్వాలిటీ  ప్లాస్టిక్‌తో తయారుచేశారు. ఇది డ్యాన్స్​ చేయాలంటే మూడు ఏఏ బ్యాటరీలు వేయాలి. 

ఉడెన్​ క్రిస్మస్ ట్రీ

క్రిస్మస్​ రోజు ఇండ్లతోపాటు మాల్స్​, హోటల్స్​లో కూడా స్పెషల్​ ఎట్రాక్షన్​గా క్రిస్మస్ ట్రీలను పెడుతుంటారు. అలా పెట్టుకోవడానికి ఇది బెస్ట్‌. దీన్ని ది క్రాఫ్ట్స్​ హెవెన్​ అనే కంపెనీ మార్కెట్​లోకి తీసుకొచ్చింది. తెలుపు రంగు బిర్చ్ ప్లైవుడ్​తో తయారు చేసిన ఈ ట్రీ 12 అంగుళాల ఎత్తు, 3 మిల్లీమీటర్ల మందంతో వస్తుంది. దీనికి వెనుకభాగంలో ఒక మల్టీ కలర్​ ఎల్​ఈడీ లైట్​ ఉంటుంది. చీకట్లో ఆ లైట్​ ఆన్​ చేస్తే.. ట్రీ చాలా అట్రాక్టివ్​గా కనిపిస్తుంది. చెట్టు మధ్యలో స్టార్స్​, కింది భాగంలో జింక ఆకారాలు ఉంటాయి. కాకపోతే దీని లైట్​ వెలగాలంటే రెండు ఏఏ బ్యాటరీలు వేయాలి. 

స్టార్​ మాస్టర్​ 

సాధారణంగా క్రిస్మస్​కి ఇంటిని లైట్లతో డెకరేట్​ చేస్తారు. కానీ.. ఈ లైట్​తో గదులను కూడా డెకరేట్​ చేయొచ్చు. జెనరిక్​ అనే కంపెనీ ‘స్టార్​ మాస్టర్’ పేరుతో ఈ ల్యాంప్​ ప్రొజెక్టర్​ని తీసుకొచ్చింది. దీన్ని గదిలో పెట్టి ఆన్​ చేస్తే.. 360 డిగ్రీల్లో స్టార్​, చందమామ ఆకారాలను ప్రొజెక్ట్‌ చేస్తుంది. రాత్రి పూట వాటి కిందే పడుకున్నట్టు అనిపిస్తుంది. దీన్ని మొత్తం ఎనిమిది మోడ్స్​లోకి మార్చుకోవచ్చు. ఒక్కో మోడ్​లో ఒక్కో ఆకారంలో లైట్​ని ప్రొజెక్ట్​ చేస్తుంది. లైట్​ని కంట్రోల్​ చేయడానికి మూడు బటన్‌లు ఉంటాయి. బటన్ ఏ: ఆన్/ఆఫ్ చేయడానికి, బటన్ బీ: లైట్​ రంగులు మార్చడానికి (వార్మ్​ వైట్​, బ్లూ, రెడ్​, గ్రీన్​, మల్టీ కలర్​), బటన్ సీ: రోటేషన్​ని కంట్రోల్​ చేయడానికి ఉపయోగపడతాయి. స్టార్ మాస్టర్​లో నాలుగు ఏఏఏ బ్యాటరీలు వేయాల్సి ఉంటుంది. లేదంటే.. యూఎస్​బీ పోర్ట్​తో కనెక్ట్‌ చేయాలి. యూఎస్​బీ కేబుల్, బ్యాటరీలు.. రెండింటినీ ఒకేసారి వాడకూడదు.