టూల్స్​ & గాడ్జెట్స్​ : చార్​కోల్​ బర్నర్​

ఇంట్లో ధూపం వేయాలన్నా, తందూరీ లాంటి వంటకాలు చేయాలన్నా నిప్పులు కావాలి. అలాంటప్పుడు ఈ గాడ్జెట్​ బాగా ఉపయోగపడుతుంది. ఈ చార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోల్ బర్నర్ హాట్ ప్లేట్​ని ‘స్టీల్ ఆన్’​ అనే కంపెనీ తీసుకొచ్చింది. దీన్ని ప్రీమియం మెటల్​ స్టీల్​తో తయారుచేశారు. ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. 

పైగా తుప్పు కూడా పట్టదు. 500  వాట్స్​ హీటింగ్ ఎలిమెంట్ ఉండడం వల్ల 3–5 నిమిషాల్లోనే బొగ్గులను నిప్పులుగా మార్చేస్తుంది. సింపుల్​గా ఇంట్లో ఉండే పవర్​ సాకెట్​కు ప్లగ్​ చేసి వాడుకోవచ్చు. బూడిద కోసం ప్రత్యేకంగా స్టోరేజీ బాక్స్​ కూడా ఉంది.  

ధర: 748 రూపాయలు