నోరెళ్లబెట్టడం ఖాయం: భారీ సినిమాలకు కేరాఫ్ మైత్రి.. లిస్టులో అన్ని క్రేజీ ప్రాజెక్టులే

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్స్ అంటే మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) అనే చెప్పాలి. ప్రెజెంట్ వాళ్ళ సినిమాల లైనప్ చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ అందరితోను వీళ్ళు సినిమాలు చేస్తున్నారు.

ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. కేవలం తెలుగులోనే కాదు తమిళ, హిందీ మార్కెట్ లో కూడా సూపర్ ప్రాజెక్ట్స్ ను సెట్ చేస్తున్నారు. కెరీర్ ప్రారంభంలోనే శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ సంస్థ.. ఆ తరువాత రంగస్థలం, పుష్పతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కూడా టాలీవుడ్ లో ఎవరికి లేనన్నీ స్టార్ హీరోల సినిమాలు ఈ సంస్థలో ఉన్నాయి. మరి ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

పుష్ప2- ది రూల్ (Pushpa2TheRule):

లిస్టులో ముందుగా అల్లు అర్జున్తో పుష్ప2(Pushpa2). సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఏ రేంజ్ అంచనాలున్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.2000 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాల అంచనా.

ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh):

ఇక రెండవది పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గబ్బర్ సింగ్ లాంటి బిగ్గెస్ట్ హిట్ తరువాత పవన్, హరీష్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. 

రామ్ చరణ్ (RC16):

ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఇప్పటికే రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ సంస్థ..ఆయనతో మరో రెండు సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. వాటిలో ఇటీవలే మొదలైన పాన్ ఇండియా మూవీ RC16, సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న RC17 సినిమాలున్నాయి. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ రెండు సినిమాలపై కూడా భారీ అంచాలున్నాయి. 

Also Read :  నార్త్ అమెరికాలో 850 లొకేషన్స్ లో పుష్ప 2 గ్రాండ్ రిలీజ్

 ప్రభాస్ (Fauji):

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సితారామం ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో ఫౌజీ సినిమా చేయనుంది మైత్రి సంస్థ. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో రెండవ ప్రపంచయుద్ధం బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎన్టీఆర్ డ్రాగన్ (Dragon):

జూనియర్ ఎన్టీఆర్తో కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ NTR 31 మూవీ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. మరి NTR 31 రెగ్యులర్ షూటింగ్ ఎప్పటినుండి షురూ కానుందో రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా  ఈ సినిమాకు 'డ్రాగన్' (Dragon) అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో ఫుల్ మాసివ్ రోల్లో తారక్ లుక్ ఉంది. 

రామ్ పోతినేని (RAPO22):

హీరో రామ్ పోతినేని (Ram Pothineni) ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు.పి (Mahesh Babu) దర్శకత్వంలో 'రాపో 22' (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు. 

అజిత్ (GoodBadUgly):

ఇక తమిళ ఇండస్ట్రీలో ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను స్టార్ట్ చేసింది మైత్రి సంస్థ. ఈ సినిమాలో తమిళ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటిస్తుండగా.. అధిక రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

సన్నీ డియోల్ జాట్ (JATT):

ఇక హిందీలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా 'జాట్'(JATT) మూవీ చేస్తున్నారు. సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. రిషి పంజాబీ డీవోపీ. తమన్ సంగీతం అందిస్తున్నాడు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, అనల్ అరసు, వెంకట్ మాస్టర్స్ ఫైట్ కొరియోగ్రాఫర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.

 జై హనుమాన్ (Jai Hanuman):

ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తెరెకెక్కించున్న జై హనుమాన్ సినిమా కూడా మైత్రి చేతిలోనే ఉంది. ఈ సినిమాలో హనుమంతుడిగా కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి నటించనున్నారు. 

నితిన్ (Robinhood):

హీరో నితిన్ డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబోలో వస్తోన్న సెకండ్ ఫిల్మ్ 'రాబిన్ హుడ్'. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది.

ఇలా ఒకటి కాదు రెండు కాదు.. వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతూ టాలీవుడ్ స్టార్ మేకర్స్గా మారిపోయారు. మరి మైత్రి మూవీ మేకర్స్ నుండి రానున్న ఈ భారీ సినిమాలు ఎలాంటి విజయాన్ని సాధిస్తాయో చూడాలి.