టాయిలెట్ సీట్ హ్యాండిల్
సాధారణంగా టాయిలెట్ సీటుకు ఎలాంటి హ్యాండిల్ ఉండదు. దాంతో.. చిన్న పిల్లలు, పెద్దవాళ్లు దాన్ని తెరవడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ల కోసమే ఈ హ్యాండిల్. దీన్ని ప్రోస్టఫ్ అనే కంపెనీ తయారుచేసింది. నాన్–టాక్సిక్ ఫీచర్లతో హై క్వాలిటి సిలికాన్ మెటీరియల్‌తో వీటిని తయారు చేస్తున్నారు. ఇది స్లిప్ కూడా కాదు. దీన్ని ఇన్స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ. హ్యాండిల్‌కు ఉండే స్ట్రిప్‌ని టాయిలెట్ సీట్ మూత చుట్టూ చుట్టాలి. తర్వాత మష్రూమ్ స్లీవ్‌ను మరో చివర ఓపెనింగ్‌లో ఉండే హోల్లో ఫిక్స్ చేయాలి. దాన్ని క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు మళ్లీ ఊడదీసుకోవచ్చు. దాదాపు అన్ని రకాల టాయిలెట్ సీట్ల మూతలకు ఇది సరిపోతుంది. మృదువైన సిలికాన్ పట్టీ ఉండడం వల్ల మూత మూసినప్పుడు వచ్చే సౌండ్ కూడా తగ్గుతుంది.
ధర : నాలుగు హ్యాండిల్స్‌కి 409 రూపాయలు
మోషన్ యాక్టివేటెడ్ లైట్
రాత్రిళ్లు టాయిలెట్‌కు వెళ్లిన ప్రతిసారి లైట్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం కొందరికి బద్ధకం అయితే, మరికొందరు నిద్ర మత్తులో మర్చిపోతుంటారు. అలాంటివాళ్లు ఈ టాయిలెట్ లైట్‌ని కమోడ్ సీట్‌కి ఇన్స్టాల్ చేసుకోవాలి. దీన్ని ఎంఐఈఎఫ్ఎల్ అనే కంపెనీ తెచ్చింది. ఇందులో రెండు సెన్సర్లు ఉంటాయి. ఇవి కమోడ్ లోపలి, బయటి కదలికలను గుర్తిస్తాయి. మోషన్ని డిటెక్ట్ చేసినప్పుడు లైట్ ఆన్ అవుతుంది. ఆ తర్వాత రెండు నిమిషాలకు ఆటోమెటిక్‌గా ఆగిపోతుంది. ఇది చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. పగటి వేళల్లో ఆన్ కాదు. ఈ లైట్‌లో 16 రంగులు ఉంటాయి. ఏది కావాలంటే అది సెలక్ట్ చేసుకోవచ్చు. బ్రైట్‌నెస్ లెవల్స్ 5 ఉంటాయి. యాంబియంట్ లైట్ ప్రకారం ఆటోమెటిక్‌గా సర్దుబాటు చేసుకుంటుంది. ఇది వెలగడానికి ఇందులో 3 ఏఏఏ బ్యాటరీలు వేయాలి. ఇది వాటర్ ఫ్రూఫ్ లైట్ కాబట్టి డిటర్జెంట్‌తో కూడా క్లీన్ చేసుకోవచ్చు.
ధర: 678 రూపాయలు
స్మార్ట్ టాయిలెట్
ప్రపంచం స్మార్ట్ గాడ్జెట్స్‌తో నిండిపోతోంది. లైఫ్స్టయిల్లో భాగమైన గాడ్జెట్స్ ఇప్పుడు వాష్‌రూమ్‌లోకి కూడా వచ్చేశాయి. ఇక్కడ కనిపించేది స్మార్ట్ టాయిలెట్ కమోడ్. దీన్ని ప్లాంటెక్స్ అనే కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. పూర్తిగా ఆటోమెటిక్‌గా పనిచేసే దీని దగ్గరకి వెళ్లి నిలబడగానే పై మూత ఆటోమెటిక్‌గా తెరుచుకుంటుంది. కమోడ్ కిందిభాగంలో ఉండే సెన్సర్ మనిషి కాలిని గుర్తించి డోర్ ఓపెన్ చేస్తుంది. అంతేకాదు.. ఇందులో ఆటోమేటిక్ ఫ్లషింగ్ సిస్టమ్ కూడా ఉంది. కమోడ్ మీది నుంచి లేవగానే డోర్ మూసుకోవడంతో పాటు వాటర్ ఫ్లష్ వాల్వ్స్ ఓపెన్ అవుతాయి. చలికాలంలో నిద్ర లేవగానే కమోడ్ మీద కూర్చోవడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి టైంలో సీట్ హీటింగ్ ఫీచర్‌ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది కమోడ్ సీట్‌ని గోరువెచ్చగా మార్చేస్తుంది. ఇవే కాదు.. ఇందులో ఇంకా చాలా ఫీచర్లు ఉన్నాయి. వాటర్ టెంపరేచర్, ఫ్లషింగ్ ప్రెజర్ లాంటి సెట్టింగ్స్‌ని అడ్జెస్ట్ చేసుకునేందుకు రిమోట్ కూడా ఉంటుంది. వామ్ ఎయిర్ డ్రయ్యింగ్, ఫిమేల్ క్లీనింగ్, బటక్స్ వాషింగ్, హెచ్డి డిస్ప్లే, సెల్ఫ్ క్లీనింగ్ లాంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ధర : 44,999 రూపాయలు