పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 5 రకాల పండ్లు తినండి

జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే..పేగులు ఆరోగ్యంగా ఉండాలి. మరీ పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..పేగులు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తలు, జీర్ణం, గ్యాస్ సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే..పేగులు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. మీ పేగుల ఆరోగ్యం, జీర్ణాన్ని మెరుగుపర్చేందుకు ఈ ఐదు రకాల పండ్లను  తింటే ఎంతో ఉపయోగంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

బ్లూబెర్రీ.. ఈ పండ్లలో ఫోలిఫెనాల్స్, ఫైబర్, నేచురల్ కాంపౌండ్స్ ఎక్కువంగా ఉంటాయి. ఇవి తింటే పేగుల ఆరోగ్యానికి దోహదం  చేస్తాయి. 

యాపిల్స్.. యాపిల్ పండ్లలో పెక్టిన్ అనే ఫైబర్  రకం  ఉంటుంది. ఇది పేగుల్లోని మైక్రోబయోమ్ లకు ప్రోబయోటిక్ లా సహకరిస్తుంది. జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. 

బొప్పాయి.. పపైన్ అనే ఎంజైమ్ బొప్పాయిలో పుష్కలంగా ఉంటుంది. ఇది పేగుల ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. మల బద్దకం సమస్యను కూడా తగ్గిస్తుంది. 

అరటిపండ్లు.. ఈ పండ్లలో సోలబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పేగుల కదలికలకు తోడ్పడుతుంది. 

కివీ పండ్లు.. ఈ పండ్లలోనూ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి తింటే జీర్ణాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలో అక్టినిడైన్ అనే ఎంజైమ్ జీర్ణ వ్యవస్థ పని తీరుకు తోడ్పడుతుంది.