కప్పు బ్రౌన్ రైస్ లో దాదాపు 21 శాతం మెగ్నీషియం ఉంటుందట. ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణవాహికలో క్యాన్సర్ రసాయనాలను బయటకు పంపుతుంది. వీటిలో సెలీనియం శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఉబ్బసం తీవ్రత తగ్గుతుంది. బ్రౌన్స్ బీ కాంప్లెక్స్, థయామిన్, రైబోప్లేవిన్, సయనకోబాలమిన్ అనే విటమిన్లు ఉంటాయి. ఇవి నరాలకు శక్తినిస్తాయి.
మలబద్దకాన్ని తగ్గిస్తాయి. బ్రౌన్ రైస్ ఊక ద్వారా వచ్చేనూనె కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీనిలో ఉండే పీచు పదార్థం వల్ల ఎల్ఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. నలభై ఏళ్లు పైబడిన మహిళలపై జరిపిన అధ్యయనంలో బ్రౌన్స్ లాంటివి తినడం వల్ల ఎంటరోల్కాక్లోన్ స్థాయి పెరుగుతుందని తెలిసింది. అందుకే పాలిష్ చేసిన బియ్యం కంటే దంపుడు బియ్యమే మంచిది అంటున్నారు డాక్టర్లు.
ఉపయోగాలు
• బరువు తగ్గుతారు.
* బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది.
• టైప్ టు షుగర్ వ్యాధి రాదు.
* గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.
• ఆడవాళ్లలో మోనోపాజ్ త్వరగా రానివ్వదు.