కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్నటీఎన్జీవోలు

కరీంనగర్ టౌన్, వెలుగు: వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డిపై దాడి  చేసిన వారితో పాటు దాడికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దాడిని ఖండిస్తూ కలెక్టరేట్ ఎదుట టీఎన్జీవోలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న 20 మంది ఆఫీసర్లపై విచక్షణా రహితంగా  కర్రలు, రాళ్లతో దాడి  చేయడం దారుణమని మండిపడ్డారు. కార్యక్రమంలో టీఎన్జీవో ప్రతినిధులు కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సుమంత్ రావు, నర్సింహస్వామి, కాళీచరణ్ గౌడ్,  హర్మిందర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు. 

జగిత్యాల టౌన్, వెలుగు: వికారాబాద్‌‌‌‌‌‌‌‌ ఘటనను నిరసిస్తూ జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీవో మధుసూదన్, కలెక్టరేట్ ఏవో హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.