ఉద్యోగులపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి టౌన్, వెలుగు: వికారాబాద్​కలెక్టర్, ఇతర ఆఫీసర్లపై దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని టీఎన్జీవో జిల్లా ప్రెసిడెంట్​నరాల వెంకటరెడ్డి, సెక్రటరీ సాయిలు డిమాండ్​ చేశారు.  మంగళవారం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ  ఎంప్లాయీస్​జాయింట్​యాక్షన్​ కమిటీ తరపున అధికారుల మీద దాడిని ఖండిస్తున్నామన్నారు.  దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల న్నారు. 

నవీపేట్, వెలుగు: ఉద్యోగులపై దాడి చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి మంగళవారం ఆందోళనకు దిగారు.  ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకట రమణ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో  రెవెన్యూ ఉద్యోగులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,  లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని  హెచ్చరించారు.