అయ్యప్ప దీక్ష 16, 17, 18 సార్లు తీసుకుంటే ఏమని పిలవాలో తెలుసా...

ప్రస్తుతం ఏ గ్రామాన్ని చూసినా స్వామి మాల ధరించిన స్వాములు మనకు కనిపిస్తుంటారు. వారు నుదుటిన దిద్దిన  చందనం, తిలకం, వారి వస్త్రాలు మనలోని భక్తి భావాన్ని పెంపొందిస్తాయి. అయ్యప్ప మాల, శివ మాల, భవాని మాల, సాయి మాల, వంటి దీక్షను చేపట్టిన భక్తులు ప్రత్యేకమైన నియమాలను ఆచరిస్తూ, నిత్యం భక్తి భావంతో ఉంటారు.అయితే మాల ధారణ పాటిస్తున్న భక్తులలో మాల ధారణ దీక్ష చేపడుతారు. అయితే శ్రీ అయ్యప్ప స్వామి దీక్షతీసుకొని శబరిమలకు మొదటి సంవత్సరం వెళుతుంటే కన్నెస్వామి.. ఆ తరువాత కత్తి స్వామి.. మూడోసారి వెళ్తే గంట స్వామి అని పిలుస్తారు.  ఇలా 18 సార్లు వెళ్లే స్వాములను ఒక్కో ఏడాది ఒక్కో స్వామి అవతారంగా భావించి పూజలు చేస్తారు. ఏ సంవత్సరం ఏ స్వామి అవతారమో  ఇప్పుడు తెలుసుకుందాం. . .

అయ్యప్ప స్వామి దీక్షలో 18 సంవత్సరములకు... 18 పేర్లు

  • 1 వ సంవత్సరము  .... కన్నె స్వామి

  • 2 వ సంవత్సరము ....కత్తి స్వామి

  • 3 వ సంవత్సరము....గంట స్వామి

  • 4 వ సంవత్సరము...గద స్వామి

  • 5 వ సంవత్సరము....విల్లు స్వామి

  • 6 వ సంవత్సరము..జ్యోతి స్వామి

  • 7 వ సంవత్సరము....సూర్య స్వామి

  • 8 వ సంవత్సరము...చంద్ర స్వామి

  • 9 వ సంవత్సరము....వేలు స్వామి

  • 10 వ సంవత్సరము...విష్ణు చక్ర స్వామి

  • 11 వ సంవత్సరము...శంఖాధార స్వామి

  • 12 వ సంవత్సరము...నాగభరణ స్వామి

  • 13 వ సంవత్సరము....శ్రీ హరి స్వామి

  • 14 వ సంవత్సరము...పద్మ స్వామి

  • 15 వ సంవత్సరము...త్రిశూల స్వామి

  • 16 వ సంవత్సరము...శ్రీ శబరిగిరి స్వామి

  • 17 వ సంవత్సరము....ఓంకార స్వామి

  • 18 వ సంవత్సరము...నారికేళ స్వామి

ప్రస్తుతం శబరిమల కొండలన్నీ అయ్యప్ప నామ స్మరణతో మారుమోగుతున్నాయి. పంబ నది దగ్గర నుంచి శబరి గిరులన్నీ అయ్యప్ప స్వామి భక్తులంతా నిండిపోయింది. స్వామి వారిని దర్శించుకునేందు భక్తులందరూ తండోపతండాలుగా తరలివస్తున్నారు.  అయ్యప్ప మాల వేసిన ప్రతిఒక్కరూ శబరి సన్నిధికి చేరుకుంటున్నారు.