గవర్నమెంట్ స్కూళ్లలో ‘తిథి భోజనం’ షురూ

బాల్కొండ,వెలుగు: మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా గవర్నమెంట్ స్కూళ్లలో శనివారం తిథి భోజనం షురూ అయింది. పిల్లలకు పౌష్టికాహారం, ఆరోగ్యవంతమైన అదనపు ఆహారం కోసం ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూడు రకాల కూరగాయలు, స్వీట్, మిర్చి,  బిర్యాని అందించామని మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు. భోజనంతోపాటు సప్లిమెంటరీ న్యూట్రిషన్ల ద్వారా విద్యార్థుల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం పోషణ్‌‌‌‌‌‌‌‌’ కార్యక్రమంలో భాగంగా ‘తిథి భోజనం’ అమల్లోకి తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో టీచర్లు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.