ఫిబ్రవరి 3 నుంచి 5 వ తేది వరకు తిరుమలలో ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ సదస్సును దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహిస్తున్నామని శుక్రవారం ( జనవరి 5)న జరిగిన డయల్ యువర్ కార్యక్రమంలో తెలిపారు. రామ జన్మభూమి అయోధ్యలో ఈ నెల 22న జరిగే శ్రీరామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్టకు.. శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్య రామాలయ భక్తులకు వితరణ చేసేందుకు 25 గ్రాముల బరువు గల లక్ష శ్రీవారి లడ్డూలను అయోధ్యకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. డయల్ యువర్ కార్యక్రమంలో జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సీఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇతర వివరాలు
-
ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా జనవరి 15వ తేదీ తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని పేరేడ్ మైదానంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు వైభవంగా శ్రీ గోదా కళ్యాణం.
-
తిరుమలలో జనవరి 16వ తేదీ కనుమ పండుగ సందర్భంగా శ్రీవారి పార్వేట ఉత్సవం, జనవరి 25న శ్రీరామకృష్ణతీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహిస్తాం.
-
తిరుపతిలోని అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులు తిరుమలలో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్‌లో టికెట్ (రూ.300/-) కొనుగోలుచేసి శ్రీవారిని దర్శించుకునే అవకాశం.
-
నకిలీ వెబ్‌సైట్లతో మోసపోకుండా టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in లో మాత్రమే ఆర్జితసేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలి
2023 డిసెంబర్లో నమోదైన వివరాలు
- శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య: 19.16 లక్షలు
- హుండీ కానుకలు ` రూ. 116.73 కోట్లు
- విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య : ఒక కోటి 46 వేలు
- అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య : 40.77 లక్షలు
- తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య : 6.87 లక్షలు